పెరుగుతున్న అకాల మరణాలు.. ఆ రోగాలే కారణం !

by Disha Web Desk 10 |
పెరుగుతున్న అకాల మరణాలు.. ఆ రోగాలే కారణం !
X

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు మనిషి వందేళ్లు బతుకుతాడనే గ్యారెంటీ ఉండేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ఎటువంటి రోగాలు లేకుండా 70 ఏళ్ల వరకు బతుకున్న వారు చాలా అరుదుగానే ఉంటున్నారు. చాలామంది రకరకాల రోగాలతో చిన్న ఏజ్‌లోనే చనిపోతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటిన వారికే అరుదుగా అనారోగ్య సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య తలెత్తుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే మనదేశంలో తలెత్తే పలు ఆరోగ్య సమస్యలు అకాల మరణాలకు కారణం అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

స్ట్రోక్, లంగ్స్ ప్రాబ్లమ్స్

ఇండియాలో అకాల మరణాలకు సెకండ్ కామన్ రీజన్ స్ట్రోక్. ప్రతీ సంవత్సరం దాదాపు 1,85,000 దీని బారిన పడుతున్నారు. ప్రతీ 4 నిమిషాలకు ఒకరు స్ట్రోక్‌ కారణంగా మరణిస్తున్నారు. ఇటీవల లంగ్స్ డిసీజెస్ కూడా అకాల మరణాలకు దారితీస్తున్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) రిపోర్టు ప్రకారం.. మన దేశంలో శ్వాస కోశ వ్యాధులో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2020లో ఆస్తమా, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి లంగ్స్ డిసీజెస్‌తో దాదాపు 1,81,160 మంది మృతిచెందారు.

గుండెపోటు

గతంలో హార్ట్ ఎటాక్స్ ఏజ్‌బార్ అయ్యాకే వచ్చేవి. కానీ ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వర్కవుట్స్ చేస్తూనో, డ్యాన్స్ చేస్తూనో, డ్రైవింగ్ చేస్తూనో గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం.. 2019లో కేవలం గుండెపోటుతో మరణించినవారి సంఖ్య 28,005. గత ఐదేళ్లుగా పరిశీలిస్తే హార్ట్ ఎటాక్ కేసులు 53% పెరిగాయని హెల్త్ సర్వేలు పేర్కొంటున్నాయి.

టీబీ, క్యాన్సర్, డయేరియా

ఐదేళ్లకంటే తక్కువ ఏజ్‌‌గల పిల్లల మరణాలకు దారి తీసే ముఖ్యమైన కారణాల్లో డయేరియా (అతిసార) వ్యాధి ఒకటి. ప్రతీ సంవత్సరం భారతదేశంలోనే సుమారు 1.1 లక్షల మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు. ఇక టీబీ (క్షయ) విషయానికి వస్తే 2020లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన టీబీ కేసుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా కేసులు నమోదైన ఏడు దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అయితే టీబీని మొదట్లోనే గుర్తించడంతో మందుల ద్వారా పూర్తిగాయ నయమై ప్రాణహాని తప్పే అవకాశాలు ఉన్నాయి. నిర్లక్ష్యం కారణంగా, చికిత్సకు దూరంగా ఉండటం మూలంగా మాత్రమే టీబీతో చనిపోయే అవకాశం ఉంటుంది. ఇక క్యాన్సర్ గురించి అందరికీ తెలిసిందే. 2022లో దీని బారినపడిన వారి మరణాల సంఖ్య 8,08,558 పెరిగింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు వివిధ రోగాలకు, అకాల మరణాలకు కారణం అవుతున్నాయి. వాటికిగల కారణాలను తెలుసుకొని నివారణా చర్యలు తీసుకోవడంవల్ల అకాల మరణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read..

రెడ్ రైస్ తింటే ఏమవుతుందో తెలుసా?

Diabates: డయాబెటిస్‌లో మరో రకం టైప్ 1.5



Next Story

Most Viewed