కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న పిల్లలకు మంచి ర్యాంకులు.. అందులో షాకింగ్ ఫలితాలు..

by Sujitha Rachapalli |

వేగంగా పరిగెత్తే ప్రపంచంలో కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట కలిసి భోజనం చేయడం కుదిరేలా లేదు. కానీ ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ అంతా కలిసి తినేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తుంది

కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న పిల్లలకు మంచి ర్యాంకులు..  అందులో షాకింగ్ ఫలితాలు..
X

దిశ, ఫీచర్స్ : వేగంగా పరిగెత్తే ప్రపంచంలో కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట కలిసి భోజనం చేయడం కుదిరేలా లేదు. కానీ ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ అంతా కలిసి తినేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తుంది నేషనల్ సెంటర్ ఆన్ అడిక్షన్ అండ్ సబ్‌స్టాన్స్ అబ్యూస్ అట్ కొలంబియా యూనివర్శిటీ అధ్యయనం. ఈ పద్ధతి పిల్లల విద్యా, భావోద్వేగ అభివృద్ధికి పునాదిగా పనిచేస్తుందని తెలిపింది. కుటుంబంతో క్రమం తప్పకుండా భోజనం చేసే పిల్లలు విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారని.. అధిక గ్రేడ్‌లు, మెరుగైన ఎగ్జామ్ స్కోర్స్ పొందుతారని గుర్తించింది.

అవును.. ఈ సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలతో సంభాషించడం, వారి చదువు గురించి చర్చించడం.. క్రమశిక్షణ, ఆసక్తి వంటి విలువలను నేర్పించడం జరుగుతుందని.. పిల్లలను మంచి లిజెనర్స్‌గా మారుస్తుందని, సానుభూతి, సమస్య పరిష్కారం వంటి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను అభివృద్ధి చేసే అవకాశం కల్పిస్తాయి. ఇవి తరగతి గదిలో మంచి ప్రవర్తన, స్నేహితులతో సంబంధాలకు దోహదపడతాయి. యుక్తవయస్సు వారిలో ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ స్థిరమైన, సహాయక వాతావరణం రోజువారీ ఒత్తిడి నుంచి రక్షణగా పనిచేస్తుంది. కుటుంబంతో కలిసి భోజనం దీర్ఘకాలిక శ్రేయస్సును పెంపొందిస్తుంది. పిల్లలలో ప్రమాదకర ప్రవర్తనలను తగ్గిస్తుంది.

జర్నల్ ఆఫ్ అడోలసెంట్ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కుటుంబంతో తరచూ భోజనం చేసే యుక్తవయస్సు పిల్లలు మాదక ద్రవ్యాల వినియోగం, ఆహార రుగ్మతలు, నేర ప్రవర్తనలో పాల్గొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో జరిగే బహిరంగ సంభాషణలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లలు తప్పుదోవ పట్టకుండా సహాయపడుతాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పరిచయం చేయడంతోపాటు పిల్లలకు సురక్షిత భావన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. భోజనం సిద్ధం చేయడంలో కలిసి పాల్గొనడం కూడా గ్రూప్‌గా పనిచేసే విలువ, బాధ్యతను పెంచుతుంది. మొత్తానికి డైనింగ్ టేబుల్ జీవన నైపుణ్యాల తరగతి గదిగా మారుతుంది. ప్రియమైన కుటుంబ సభ్యులతో గడపడం ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా చేస్తుంది.

Next Story