- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24k, 22k మరియు 18 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసం ఏంటి..?
బంగారంలో 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ అనే మాట వింటుంటాం. అయితే, చాలామందికి వీటి మధ్య ఉన్న...difference between 22, 24, 18 carat gold

దిశ, వెబ్ డెస్క్: బంగారంలో 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ అనే మాట వింటుంటాం. అయితే, చాలామందికి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ వస్తుంది. 24 క్యారెట్ బంగారం అంటే 99.9% ప్యూర్ గోల్డ్. అందుకనే ఇది చాలా ఎక్స్‌పెన్సీవ్. ఈ 24 క్యారెట్ బంగారంతో ఎటువంటి చైన్స్ గానీ, ఉంగరాలు గానీ చేయరు. ఎందుకంటే ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఇందులో ఎటువంటి మెటీరియల్స్ మిక్స్ అవ్వవు. అందుకనే వీటితో ఎక్కువగా గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ను మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. పొరపాటున ఉంగరాలు, చైన్స్ చేసినట్లయితే నొక్క గానే మెత్తబడిపోతాయి. అందుకనే 22 క్యారెట్ గోల్డ్ అనగా.. దీనిలో 91.6% పర్సంటేజ్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగతాది 8.4% మెటల్ కలిసి ఉంటుంది. అంటే సిల్వర్, కాఫర్, జింక్... ఇలాంటి వాటిని ఈ 22 క్యారెట్ బంగారంలో మిక్స్ చేస్తుంటారు. అందుకనే స్ట్రాంగ్ గా ఉంటాయి. అదేవిధంగా 18 క్యారెట్ బంగారంలో 75% ప్యూర్ గోల్ ఉంటుంది. మిగతా 25% మెటల్స్ ఉంటుంది. ఇది వీటి మధ్య ఉన్న తేడా.






