- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Currency : ఆ దేశాలకు సొంత కరెన్సీ లేదని తెలుసా .. ఎందుకంటే..?
ప్రాణం లేని ఈ నోటు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత ప్రపంచంలో దేనికి ఎక్కువ పవర్ ఉందని అడిగితే .. అందరి నోటి నుంచి ఒకటే జవాబు వస్తుంది డబ్బు ( Currency) అని ..! ఎందుకంటే, ప్రాణం లేని ఈ నోటు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. డబ్బు ఉంటే చాలు అన్ని పనులు ఇట్టే అయిపోతాయి. ఉదయం మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే ముందు వరకు మనతో పాటు డబ్బు కూడా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే, ఇక్కడ మనం అలిసిపోతాము కానీ, కరెన్సీ మాత్రం మిల మిల మెరుస్తూనే ఉంటుంది.
అయితే, ఈ వరల్డ్ లో పవర్ ఫుల్ కరెన్సీ అమెరికా డాలర్ లేదా బ్రిటన్ పౌండ్ అని చెబుతారు. నిజానికి డాలర్, పౌండ్ కంటే కువైట్ దినార్ , బహ్రెయిన్ దినార్ మోస్ట్ పవర్ ఫుల్ కరెన్సీగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి , బిజినెస్ , ఇండస్ట్రీలు వంటి అంశాలు కరెన్సీ విలువను పెంచుతాయి.
ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు సొంత కరెన్సీని కలిగి ఉన్నాయి.. అయితే, కొన్ని దేశాలకు మాత్రం ఇప్పటికి కూడా సొంత కరెన్సీ లేదు. ఆ దేశాలు ఇతర దేశాల కరెన్సీలను వాడుతున్నాయి. ఆర్థిక, చారిత్రక కారణాల వలన ఆ దేశాలు ఇతర దేశ ఆర్ధిక వ్యవస్థ పై ఆధారపడుతున్నాయి. దీని వలన కొన్ని లాభాలున్నప్పటికి, నష్టాలు కూడా ఉన్నాయి. ఏయే దేశాలకు సొంత కరెన్సీ లేదో ఇక్కడ తెలుసుకుందాం..
పనామా ( Panama ) :
1903లో స్వాతంత్ర్యం పొందడానికి అమెరికా సహాయం చేసింది. అప్పటి నుంచి పనామా అమెరికా కరెన్సీ నే ఉపయోగిస్తుంది.
నౌరు ( Nauru ) :
ఇది వరల్డ్ లోనే అతి చిన్న దేశం. ఈ దేశ జనాభా 10,000 మాత్రమే. సొంత రాజధాని, సైన్యం ఉంది కానీ సొంత కరెన్సీ మాత్రం లేదు. మొదట్లో జర్మనీ ఆధీనంలో ఉన్న నౌరు దేశం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఆస్ట్రేలియన్ కరెన్సీ అయిన డాలర్ ను వాడుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Read More..
Viral video: ఇలాంటి వీడియోలు చూసినప్పుడే మానవత్వం ఇంకా బ్రతికే ఉందనిపిస్తుంది!






