Viral video: ఇలాంటి వీడియోలు చూసినప్పుడే మానవత్వం ఇంకా బ్రతికే ఉందనిపిస్తుంది!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-15 13:41:40  IST  )

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌ అవుతుంటాయి.

Viral  video: ఇలాంటి వీడియోలు చూసినప్పుడే మానవత్వం ఇంకా బ్రతికే ఉందనిపిస్తుంది!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియాలో (Social media) క్షణాల్లో వైరల్‌ (Viral) అవుతుంటాయి. ఇక నెట్టింట నిత్యం వైరల్ అయ్యే వీడియోల్లో నెటిజన్లను ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఆకర్శిస్తుంటాయి. అవి చేసి అల్లరి పనులు, వింత చేష్టలు చూసి సంబరపడిపోతుంటారు. తాజాగా కూడా సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో వైరల్‌గా మారింది. రోడ్డుపై తల్లి ఏనుగుతో (Elephant) కలిసి వెళ్తున్న పిల్లి ఏనుగు సడెన్‌గా ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి మరీ.

వీడియోలో ఓ తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటాయి. దారిలో ఓ యువకుడు వాటర్ పైపుతో మొక్కలకు నీళ్లు పడుతూ వాటిని కనిపించాడు. వెంటనే పిల్ల ఏనుగు అతడి వద్దకు వెళ్లింది. ఆ యువకుడు అది నీటి కోసమే వచ్చిందని తెలుసుకుని వాటర్ పైపును దాని తొండానికి అందించాడు. దీంతో ఆ పిల్ల ఏనుగు తొండెంతో పైపు నోటిలో పెట్టుకుని యువకుడి సాయంతో దాని దాహాన్ని తీర్చుకుంది. అనంతరం తల్లి ఏనుగు వచ్చి తన బిడ్డ దాహం తీర్చినందుకు ఆ యువకుడికి కృతజ్ఞత తెలిపినట్లుగా తొండెన్ని పైకి ఎత్తి చూపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేపాల్‌లో (Nepal) చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని, ఆ యువకుడిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story