- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామసూత్ర గ్రంథాన్ని వాత్స్యాయనుడు అందుకోసమే రాశారా ?
ప్రపంచంలో శృంగార అనుభూతిని ఆస్వాదించని జీవి ఉండదు.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో శృంగార అనుభూతిని ఆస్వాదించని జీవి ఉండదు. సృష్టి ముందుకు సాగాలన్నా, అంతటితో అంతం అవ్వాలన్నా శృంగారమే మూలం. అయితే ఈ రతిక్రీడ గురించి తెలియని వారికి అవగాహన కల్పించేందుకు, శృంగార భంగిమల గురించి తెలిపేందుకు వాత్స్యాయనుడు ఓ గ్రంథాన్నే రచించారు. అదే కామసూత్ర. వాత్స్యాయనుడు రచించిన ఈ గ్రంథం గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరనుకుంటా.
విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ గ్రంథం కొత్తగా పెళ్లి అయిన వారికి, త్వరలో పెళ్లి చేసుకోబోయే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాలా వరకు ఈ పుస్తకంలో శృంగార రహస్యాలు, రతి క్రీడల గురించి మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ గ్రంథంలో రతి గురించి మాత్రమే కాకుండా వైవాహిక జీవితం, గృహం, మానవ సంబంధాల గురించి కూడా క్లుప్తంగా రాశారట.
1250 శ్లోకాలు, 36 అధ్యాయాలుగా ఉన్న ఈ గ్రంథాన్ని ఏడు ఉపఖండాలుగా వర్గీకరించారు. ఈ పుస్తకంలో శృంగారం, అందులోని భంగిమల గురించి కేవలం 20 శాతం మాత్రమే వాత్స్యాయనుడు రచించారట. ఈ కొంత భాగంలోనే శృంగారానికి సంబంధించిన అనుమానాలను పోగొడుతుందట. కొత్తగా జీవితం మొదలు పెట్టే దంపతులకు బంధాల గురించి కూడా తెలుపుతుందట. దంపతులు ఉత్తమమైన జీవితాన్ని గడిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందట. మనిషి జీవితంలోని ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కాణించి జ్ఞానం, తెలివిని పెంచుతుందట.






