Best Snacks for Diabetes: షుగర్‌ ఉందా? ఈ స్నాక్స్‌ తింటే తగ్గుతుందట... ఒక సారి ట్రై చేయండి!

by Bhoopathi Nagaiah |

Best Snacks for Diabetes: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు (Diabetic patients)వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలమీదకే వస్తుంది. అందుకే షుగర్ పేషంట్లు ఏది తినాలన్నా కూడా ఆలోచిస్తుంటారు. అయితే షుగర్ లెవల్స్ పెరగకుండా కొన్ని స్నాక్స్ హ్యాపీగా తినవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.

Best Snacks for Diabetes: షుగర్‌ ఉందా? ఈ స్నాక్స్‌ తింటే తగ్గుతుందట... ఒక సారి ట్రై చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు(Diabetic patients) ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. చాలా రకాల పదార్థాలను చూసిన తినలేని పరిస్థితితో నోరు కట్టేసుకుంటారు. భోజనం విషయంలో కూడా ఇలా ఉంటే..స్నాక్స్ అనేదే వారికి తెలియదు. ఏం తిన్నా షుగర్ పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ షుగర్ లెవల్స్ (Sugar levels)పెరగకుండానే హ్యాపీగా తినే కొన్ని స్నాక్స్ ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్(Snacks) తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్(blood sugar Levels) పెరగవని చెబుతున్నారు. ఆ స్నాక్స్ ఏవో చూద్దామా?

టైప్ 2 డయాబెటిస్(Type 2 diabetes) తో బాధపడే వ్యక్తులు రక్తంలో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే భోజనం, డిన్నర్ మధ్యలో స్నాక్స్ తప్పకుండా తినాలని సూచిస్తున్నారు. స్నాక్స్ తీసుకుంటే అతిగా తినాలనే కోరికలను అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అయితే స్నాక్స్ అంటే చాలా మంది చిప్స్, పిజ్జాలు, బర్గర్స్ అనుకుంటారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో జంక్ ఫుడ్ తినకూడదని చెబుతున్నారు. ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే స్నాక్స్ తీసుకుంటే వీటిలో పోషకాలు, రక్తంలో చక్కెర లెవల్స్ అదుపులో ఉంచుకునేందుకు సహాయపడతాయని చెబుతున్నారు.

వేయించిన శనగలు:

వేయించిన శనగలు షుగర్ బాధితులకు బెస్ట్ స్నాక్. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రెండూ కూడా రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు సహాయపడుతాయి.

బాదం:

ఇవి కూడా షుగర్ బాధితులకు బెస్ట్ స్నాక్స్. బాదంలో విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని తింటే క్లోమం పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

యోగర్ట్ విత్ బెర్రీస్

గ్రీక్ యోగర్ట్, బెర్రీస్ కాంబినేషన్ మంచి ఎంపిక. గ్రీక్ యోగర్ట్ అనేది సాధారణ యోగర్ట్ కంటే మరింత గట్టిగా క్రీమిగా ఉండే ఒక రకమైన పెరుగు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, విటమిన్, బి12 వంటి పోషకాలు పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రొటీన్ రక్తంలో చక్కెర లెవల్స్ కంట్రోల్ చేసుకునేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గుడ్డు

షుగర్ పేషంట్లకు గుడ్లు మంచి స్నాక్. ఉడకబెట్టిన గుడ్లు తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజుకో గుడ్డు తింటే శరీరంలో చెక్కర లెవల్స్ అదుపులో ఉంటాయని చెబుతున్నారు.

పాప్ కార్న్:

షుగర్ పేషంట్లకు మరోబెస్ట్ స్నాక్ పాప్ కార్న్. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే షుగర్ లెవల్స్ పెరగకుండా చూస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి తింటే బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇవి మాత్రమే కాదు యాపిల్స్, పీనట్ బటర్, చీజ్, బ్లాకన్ బీన్ సలాడ్ వంటి వాటిని కూడా స్నాక్స్ గా తీసుకుంటే డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యులు సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Next Story