Diabetes : డయాబెటిస్ ఉన్నా వైట్‌ రైస్‌ తినొచ్చు..! షుగర్ లెవల్స్ కూడా పెరగవ్!!

by Javid Pasha |   (  Updated:2024-12-05 10:07:51  IST  )

Diabetes : డయాబెటిస్ ఉన్నా వైట్‌ రైస్‌ తినొచ్చు..! షుగర్ లెవల్స్ కూడా పెరగవ్ !!

Diabetes : డయాబెటిస్ ఉన్నా వైట్‌ రైస్‌ తినొచ్చు..! షుగర్ లెవల్స్ కూడా పెరగవ్!!
X

దిశ, ఫీచర్స్ : డయాబెటిస్ ఉన్నవారు సాధారణంగా వైట్ రైస్ తినరు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని డాక్టర్లు కూడా చెబుతుంటారు. కాబట్టి రొట్టెలు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, క్వినోవా, ఇతర ఫైబర్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తింటుంటారు. పైగా షుగర్ పేషెంట్లు అన్నం తింటే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలతోపాటు గుండె జబ్బుల రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి తినాలని మనసు లాగినా.. అన్నం తినడానికి భయపడుతుంటారు షుగర్ బాధితులు. కానీ అలాంటి భయం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ‘ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌’లో పబ్లిషైన అధ్యయనం ప్రకారం.. అన్నం తిన్నా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం లేదు. అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం.

బంగాళ దుంపలు, తెల్ల బియ్యంలో, వండిన అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడంవల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే వండిన తర్వాత పూర్తిగా చల్లారక తినడంవల్ల ఎలాంటి నష్టం లేదని తాజా అధ్యయనం రుజువు చేసింది. ఫ్రిడ్జ్‌లో పెట్టడంవల్ల చల్లగా మారిన అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతాయని, దానిని తిన్నా షుగర్ లెవల్స్ పెరగవని పరిశోధకులు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా రీసెర్చర్స్ టైప్ 1 డయాబెటిస్ ఉన్న 32 మంది రోగులకు వేర్వేరు భోజనాలు ఇవ్వడం ద్వారా ఫలితాలను పరిశీలించారు.

షుగర్ బాధితుల్లో కొందరికి తాజాగా వండిన వైట్ రైస్ ఇవ్వగా, మరి కొందరికి వండిన తర్వాత 24 గంటలపాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఆ తర్వాత చల్లబడిన అన్నాన్ని వేడి చేసి ఇచ్చారు పరిశోధకులు. కాగా చల్లబడిన భోజనం తిన్నవారిలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. చల్లబడిన తర్వాత అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గడం వల్ల ఇలా జరుగుతుందని కనుగొన్నారు. దీనినే స్టార్చ్ రెట్రోగ్రేడేషన్ ప్రాసెస్ అంటున్నారు. ఈ పరిస్థితిలో చల్లారిన తర్వాత జీర్ణమయ్యే పిండి పదార్థం బాడీలోని షుగర్‌‌ను స్పైక్ చేయలేదు. పైగా గట్ ఆరోగ్యానికి కూడా మేలు జరగుతుందని చెబుతున్నారు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా వివిధ అధ్యయనాల నుంచి సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు.

Next Story