- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డయాబెటిస్ బాధితులు చక్కెర తగ్గించగానే సరిపోదు.. ఇది కూడా చేయాలి!
ఫైబర్ కలిగిన ఆహారాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇవి జీర్ణక్రియను నెమ్మదింప జేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అడ్డుకుంటాయి.

దిశ, ఫీచర్స్ : షుగర్ బాధితులు దానిని నియంత్రణలో ఉంచుకోవడం కోసం చక్కెర వాడకం తగ్గిస్తుంటారు. అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, పానీయాలు మానేస్తుంటారు. ఇది మంచిదే. కానీ ఇది మాత్రమే డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచడానికి సరిపోదు. మీ రోజువారీ ఆహారంలో హై -ఫైబర్ ఆహారాలను చేర్చాల్సిన అవసరం ఉందని డైటీషియన్లు చెబుతున్నారు. అవి ఏవి? ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి ఫైబర్ అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. రక్తంలో చక్కెర హఠాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. బరువు నిర్వహణకు, నియంత్రణకు సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు ఫైబర్ కలిగిన ఆహారాన్ని తప్పక తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఇందులోనూ ఫైబర్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాల్యూబుల్ (నీటిలో కరిగే), అండ్ ఇన్‌సాల్యూబుల్ (కరగని). ఈ రెండూ డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడతాయి.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు 22–35 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఈ హై-ఫైబర్ ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింప చేస్తాయి. పోస్ట్-మీల్ స్పైక్‌లను తగ్గిస్తాయి. సాల్యూబుల్ ఫైబర్ పేగులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దీంతో చక్కెర శోషణ మరింత ఆలస్యమవుతుంది. అంతేకాకుండా ఇవి ఆకలిని తగ్గించి, అధిక ఆహారం తీసుకోకుండా కాపాడతాయి.
డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచే బెస్ట్ ఫైబర్ ఫుడ్స్
*అవకాడో : వంద గ్రాముల అవకాడోలో సుమారు 6.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీంతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ చక్కెర కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది. సలాడ్‌లు, స్మూతీలు లేదా టోస్ట్‌పై కూడా వాడవచ్చు.
*బెర్రీస్ : స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటివన్నీ షుగర్ నియంత్రణలో కీ రోల్ పోషిస్తాయి. వంద గ్రాముల రాస్ప్‌బెర్రీ(Raspberry) 6.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. తక్కువ చక్కెర, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. కాబట్టి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి.
*బ్రోకలీ : ఒక కప్పు బ్రోకలీలో 2.2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కేలరీలు తక్కువ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా సహాయపడుతుంది.
*పీస్ (బటర్ పీస్) : వండిన ఒక కప్పు బటర్ పీస్‌లో 8.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. నెమ్మదిగా జీర్ణమై, మీల్ తర్వాత చక్కెర స్పైక్ తగ్గిస్తుంది.
*పప్పులు : పప్పులు ఏవైనా వంద గ్రాములకు 7.9 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్, ప్రోటీన్, ఐరన్ ఎక్కువ. మీల్స్ తర్వాత స్థిరమైన బ్లడ్ షుగర్ కలిగి ఉండేందుకు సహాయపడతాయి.
*బార్లీ & ఓట్‌మీల్ : వండిన బార్లీలో ఒక కప్పునకు 6 గ్రాములు, ఓట్స్‌లో అరకప్పుకు 4 గ్రాములు ఫైబర్ ఉంటుంది. అంతేకాదు సాల్యూబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండి, గ్లూకోజ్ శోషణను నెమ్మదింప జేయడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కరను అదుపులో ఉంచుతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






