Depression కు ఈ పదార్థాలే కారణం.. ఈ చిట్కాలతో ఒత్తిడికి చెక్ పెట్టండి

by Disha Web Desk 22 |
Depression కు ఈ పదార్థాలే కారణం.. ఈ చిట్కాలతో ఒత్తిడికి చెక్ పెట్టండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో కాస్త తీరిక లేకుండా బిజీబిజీ లైఫ్‌ గడుపుతున్న చాలామంది వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతున్నారు. అయితే దీనికి ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిడి, ఒంటరి తనం, ఆనందమైన జీవితం గడపకపోవటం, వ్యక్తిగత ఇబ్బందులు ఇతరులతో షేర్ చేసుకోకుండా తమలో తామే కుంగిపోవడం వంటివి ఎన్నో కారణాలు డిప్రెషన్‌కు దోహదం చేస్తున్నాయి. అంతేకాదు మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలు కూడా ఈ సమస్యని ప్రేరేపిస్తున్నాయని.. ఆ పదార్థాలను మానుకుంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం.

సోడియం అధికంగా ఉండే పదార్థాలు : బిస్కెట్స్, ప్యాక్ చేసిన పేస్ట్రీలు, బ్రెడ్‌ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలో ఎక్కువ సోడియం ఉంటుంది. అందువల్ల ఇవి డిప్రెషన్‌ తీవ్రతను మరింత ఎక్కువ చేస్తాయట. కాబట్టి ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఆల్కహాల్ : చాలామంది ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆల్కహాల్‌కు ఎక్కువగా అడిక్ట్ అవుతుంటారు. అయితే అలా చేయడం వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఎవరైనా మద్యం సేవిస్తున్నట్లయితే వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.

కెఫిన్ పదార్థాలు : చాలామంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, తలనొప్పి అనిపించినప్పుడు రిలీఫ్ కోసం టీ లేదా కాఫీ తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం కూడా మంచిది కాదని.. వీటి వలన నిద్ర తగ్గే ఆస్కారం ఉందని నిపుణులు అంటున్నారు. కాగా ఈ రెండింటిలో కెఫిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల డిప్రెషెన్ మరింత పెరుగుతుంది.

జంక్ ఫుడ్స్ : ఉరుకుల పరుగుల జీవితంలో మానవుడు జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడిపోయాడు. ఇంట్లో చేసుకోలేని రకరకాల ఫుడ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పొందుతున్నాడు. అయితే బాగా డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులకు ఈ ఫుడ్స్ ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

ధూమపానం : ధూమపానం శరీర అవయవాలపై ఎంతటి చెడు ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. అలాగే అధిక ఒత్తిడితో ఉన్నపుడు కూడా కొందరు ధూమపానానికి అడిక్ట్ అవుతారు. కాబట్టి అలాంటి ఒత్తిడి సమయంలో పొగతాగడం చేస్తే ఫలితంగా నిద్ర పట్టక ఆందోళన పెరుగుతుందట.

ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి :

* ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మెడిటేషన్ (ద్యానం) మంచి వైద్యమని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 15నిమిషాలు ప్రశాంతమైన ప్లేస్‌లో మెడిటేషన్ చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

* బాధ కలిగించే ప్రతి ఒక్క విషయాన్ని క్లోజ్ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటే కొంత భారం తగ్గి ఉపశమనం కలుగుతుంది.

* నచ్చిన పనిపై ఫోకస్ పెట్టడం, నచ్చిన సాంగ్స్ వినడం, అలాగే మీకు ఇష్టమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే కూడా ఫలితం ఉంటుంది.

* ఇష్టమైన వారితో టైం స్పెండ్ చేయడం, నచ్చిన ప్రాంతాలకు వెళ్లడం మంచిది.

* తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇక అప్పటికీ డిప్రెషన్ లక్షణాలు అలాగే ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.



Next Story

Most Viewed