లవ్, బ్రేకప్‌పై కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఢిల్లీ యూనివర్సిటీ.. సిలబస్‌లో తెలుగు సినిమా.. ఫుల్ డిటెయిల్స్

by Sujitha Rachapalli |

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల వల్ల పెరిగిన టాక్సిక్ రిలేషన్‌షిప్స్ నేరాలకు కారణమవుతున్నాయి. ష్రద్ధా వాకర్, సోనమ్ రఘువంశీ వంటి కేసులు సొసైటీని భయపెడుతున్నాయి. నిజానికి రిజెక్షన్, బౌండరీలను ఎలా హ్యాండిల్ చేయాలో ఎవరూ నేర్పరు. కానీ దీన్ని నేర్చుకుంటే ఇలాంటి కొన్ని

లవ్, బ్రేకప్‌పై కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఢిల్లీ యూనివర్సిటీ.. సిలబస్‌లో తెలుగు సినిమా.. ఫుల్ డిటెయిల్స్
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల వల్ల పెరిగిన టాక్సిక్ రిలేషన్‌షిప్స్ నేరాలకు కారణమవుతున్నాయి. ష్రద్ధా వాకర్, సోనమ్ రఘువంశీ వంటి కేసులు సొసైటీని భయపెడుతున్నాయి. నిజానికి రిజెక్షన్, బౌండరీలను ఎలా హ్యాండిల్ చేయాలో ఎవరూ నేర్పరు. కానీ దీన్ని నేర్చుకుంటే ఇలాంటి కొన్ని ట్రాజెడీలు నివారించవచ్చు. ఈ క్రమంలోనే ఢిల్లీ విశ్వవిద్యాలయం గొప్ప నిర్ణయం తీసుకుంది. ‘నెగోషియేటింగ్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్స్’ అనే సైకాలజీ కోర్సును ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి మొదలయ్యే ఈ కోర్సు.. ప్రేమ, విడిపోవడం, టాక్సిక్ రిలేషన్‌షిప్స్ గురించి రూపొందించబడింది. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరికీ ఈ కోర్సు.. ఓపెన్ ఎలక్టివ్‌గా అందుబాటులో ఉంటుండగా.. ప్రేమ, స్నేహం అనే ముసుగులో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భావోద్వేగ స్థిరత్వం, రెడ్ ఫ్లాగ్‌లు, ఆరోగ్యకర బంధాల గురించి నేర్పించనుంది.

వారానికి మూడు లెక్చర్స్, ఒక్క ట్యుటోరియల్ కలిగిన లవ్, బ్రేకప్ కోర్సు.. స్నేహాలు ఎలా ఏర్పడతాయి? రొమాంటిక్ బంధాలుగా ఎలా మారతాయి? అనేది వివరించనుంది. స్టెర్న్‌బర్గ్ ట్రయాంగులర్ థియరీ, టూ-ఫాక్టర్ థియరీ వంటి లవ్ అండ్ సెక్చువాలిటీ సిద్ధాంతాల గురించి తెలుపుతూ.. జెలసీ, ఎమోషనల్ మానిపులేషన్, ఆన్‌లైన్ స్టాకింగ్, ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్ వంటి రెడ్ ఫ్లాగ్‌లపై జెన్ జెడ్‌కు అవగాహన కల్పించనుంది. ఎమోషనల్ సపోర్ట్, కమ్యూనికేషన్, రెసిలియెన్స్ వంటి ఆరోగ్యకర సంబంధాలను ఎలా నిర్మించుకోవాలో వివరించనుంది.

బోధనా పద్ధతులు

సోషల్ మీడియా విశ్లేషణ: సంబంధాల డైనమిక్స్ అర్థం చేసుకోవడానికి సోషల్ మీడియా ఇంటరాక్షన్‌ల మ్యాపింగ్.

పాప్ కల్చర్ విశ్లేషణ: కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి), టైటానిక్ వంటి సినిమాల ద్వారా టాక్సిక్ ప్యాటర్న్‌ల చర్చ.

వర్క్‌షాప్‌లు: బ్రేకప్ సీనారియోలు, బౌండరీ సెట్టింగ్, సెల్ఫ్-అవేర్‌నెస్, క్షమాపణ ఎక్సర్‌సైజ్‌లు.

డిబేట్‌లు: టిండర్ వంటి ఆన్‌లైన్ డేటింగ్ సవాళ్లపై చర్చలు.

లక్ష్యాలు

* ప్రేమ, ఒత్తిడి, సంఘర్షణల సైకాలజీని అర్థం చేసుకోవడం.

* రెడ్ ఫ్లాగ్‌లను గుర్తించి, ఎమోషనల్ ట్రిగ్గర్‌లను నిర్వహించడం.

* గౌరవప్రదమైన, అర్థవంతమైన బంధాలను నిర్మించడం.

Next Story