గాయపడిన పక్షులకు.. గార్డ్ ఫాదర్స్.!

by Daayi Srishailam |

వేల సంఖ్యలో పక్షులకు ఊపిరి పోస్తున్నారు

గాయపడిన పక్షులకు.. గార్డ్ ఫాదర్స్.!
X

దిశ, ఫీచర్స్: ఢిల్లీ సోదరులు నదీమ్ షెహజాద్, మొహమ్మద్ సౌద్ గాలిపటాల మంజా వల్ల గాయపడిన పక్షులను రక్షిస్తున్నారు. ఒక గాయపడిన గద్దతో ప్రారంభమైన వారి ప్రయాణం వేల సంఖ్యలో పక్షులకు ఊపిరి పోసే విధంగా చేసింది.

చికిత్సకు నిరాకరిస్తే..

నదీమ్, సౌద్ రోడ్డు పక్కన గాయపడిన గద్దను చూశారు. అది గాలిపటం మంజాలో చిక్కుకుని ఉంది. గాలిపటాల తీగలు పక్షులకు ఎలా హాని చేస్తు్న్నాయో ఆ ఘటన ద్వారా తెలుసుకున్నారు. ఆ గద్దను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఎక్కడా సహాయం దొరకలేదు. పైగా మాంసాహార పక్షులను చికిత్స చేయం అని చెప్పారట డాక్టర్లు. ఏమీ చేయలేక ఆ పక్షిని తిరిగి అదే స్థలంలో వదిలిపెట్టారు. ఆ ఘటన తర్వాత గాయపడిన పక్షులు ఎక్కడ కనిపించినా వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి మాంజాను దాన్నుంచి వేరు చేసి ఆహారం ఇచ్చి పంపించేవారు.

స్వేచ్ఛాయుత పంజరం

2003లో వీళ్లకు మరోసారి పార్కింగ్ లాట్‌లో గాయపడిన గద్ద కనిపించింది. తమకు తెలిసిన వెటర్నరీ డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అంతా వివరించి మొత్తానికి ఆ డాక్టర్‌ను కన్విన్స్ చేశారు. గతంలో మాదిరి గాయంతోనే వదిలేయడం కాకుండా కాపాడగలిగాం అనే సంతోషం కలిగింది. అప్పట్నుంచి గాయపడిన పక్షులను కాపాడేందుకు వేట కొనసాగించారు. ఎక్కడ పక్షి గాయపడినా అక్కడకు వెళ్లి తమ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవారు. క్రమంగా పక్షుల సంఖ్య పెరిగింది. వాటికోసం ఒక పెద్ద పంజరాన్ని తయారుచేయించారు. పగటిపూట వదిలేసేవాళ్లు.. సాయంత్రానికి అవి గూడు చేరేవి.

వైల్డ్‌లైఫ్ రెస్క్యూ ఎన్‌జీఓ

అన్నీ వేర్వేరు జాతి పక్షులు. ఒకదానిపై ఇంకోదానికి కోపం ఉంటాయి కూడా. అలాంటివాటిని అన్నింటినీ ఒకేచోట చేర్చి వాటిమధ్య స్నేహబంధాన్ని ఏర్పరచి భిన్న పక్షుల ఉమ్మడి కుటుంబంలా మార్చేశారు. 2003 వరకు అలా గుడ్లగూబలు, హాక్‌లు, వాటర్ హెన్‌లు, ఎగ్రెట్‌లు, గద్దలతో 400 పక్షులను రక్షించారు. ఇలా ఇండివిజువల్‌గా కాకుండా సంస్థాగతంగా కార్యక్రమాలు చద్దామని 2010లో ‘వైల్డ్‌లైఫ్ రెస్క్యూ’ ఎన్‌జీఓను స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 భిన్న జాతులకు చెందిన 23,000 కంటే ఎక్కువ పక్షులను రక్షించారు. ప్రతి సంవత్సరం కనీసం 40 జాతులను సంరక్షిస్తారు.

వ్యాధులున్నా సరే..

ఢిల్లీ పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, పౌర సంస్థల అధికారుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా గాయపడిన పక్షులను సేకరిస్తారు. పక్షులను గుర్తించిన వారు తమకు అప్పగిస్తారు. గాయపడిన పక్షులకు అన్ని రకాల గాయాలు లేదా వ్యాధులు ఉంటాయి. కొన్నిసార్లు గాయాలు చిన్నవిగా ఉంటాయి. కొన్ని పక్షులకు తీవ్రమైన గాయాలు ఉంటాయి. కొన్ని స్త్రీ జనన సంబంధిత సమస్యలు, గుడ్డు పెట్టేటప్పుడు చిక్కుకుని ఉంటాయి. అలాంటి సమస్యేలి ఉన్నా గాయపడిన పక్షులను అక్కున చేర్చుకొని ఆశ్రయమిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్నాదమ్ములు.

Next Story