HEROINES - GLOWING SKIN : హీరోయిన్ల చర్మ రహస్యం ఇదే.. ఈ జ్యూస్ మూడు నెలలు తాగితే చాలు...

by Sujitha Rachapalli |

ఎంత మంది సెలబ్రిటీలు ఉన్నా అందరిలోనూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది దీపికా పదుకొనే(Deepika Padukone). మెరిసిపోయే చర్మం(Glowing Skin) కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది.

HEROINES - GLOWING SKIN :  హీరోయిన్ల చర్మ రహస్యం ఇదే.. ఈ జ్యూస్ మూడు నెలలు తాగితే చాలు...
X

దిశ, ఫీచర్స్ : ఎంత మంది సెలబ్రిటీలు ఉన్నా అందరిలోనూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది దీపికా పదుకొనే(Deepika Padukone). మెరిసిపోయే చర్మం(Glowing Skin) కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు, ప్రకాశవంతమైన చిరునవ్వుతో అట్రాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె దగ్గర వర్క్ చేసిన పోషకాహార నిపుణులు శ్వేతా షా.. ఈ హీరోయిన్ అంత

అమేజింగ్ గా కనిపించేందుకు గల సీక్రెట్ జ్యూస్ గురించి వివరించింది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వేప ఆకులు, బీట్ రూట్ కలిపి బ్లెండ్ చేసుకుని రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగుతుందని తెలిపింది. ఈ గ్లోయింగ్ స్కిన్ జ్యూస్ ను దాదాపు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ ఫాలో అవుతారని చెప్పింది.

అయితే దీనిపై స్పందిస్తున్న నిపుణులు.. అందరికీ ఇది సూట్ కాదని చెప్తున్నారు. దీర్ఘకాలిక చర్మ ప్రయోజనాలను పొందేందుకు జనాలు షార్ట్‌కట్‌లు, హ్యాక్‌ల కోసం చూస్తారని.. ఇది కూడా అలాంటిదే అని చెప్తున్నారు. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, డయేరియా జీర్ణ సమస్యలు వస్తాయని.. గట్ హెల్త్(Gut Health )కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. మొటిమలు, తామర, చర్మంపై మంట వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ జ్యూస్‌ని ఎక్కువగా తాగడం మానుకోవాలని.. లేదంటే మంట, అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుందని హెచ్చరించారు. ఇలాంటివి ప్రయత్నించే ముందు ఓసారి డాక్టర్ ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

Next Story