- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Success Story : డిగ్రీలుంటే మాత్రం డెస్క్ జాబ్‌లే చేయాలా..? ట్రక్ డ్రైవర్లుగా చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్న దంపతులు..!

దిశ, ఫీచర్స్ : ‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసవుతుంది’ అంటారు పెద్దలు. డిగ్రీలు చేతిలో ఉన్నంత మాత్రానో, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నంత మాత్రానో మీరు జీవితంలో సక్సెస్ కాలేరు. దానికో లక్ష్యం కూడా ఉండాలి. అందుకోసం కలలు కనాలి. ఆ కలలకు శ్రమ తోడు కావాలి. అందుకే శ్రమ లేనిదే జీవితం లేదు, శ్రమ చేయనిదే ఫలితం రాదు అంటారు నిపుణులు. అది అక్షరాలా నిజమని నిరూపించారు దీపక్ పటేల్ దంపతులు. ఇప్పుడు వారీ సక్సెస్ జర్నీ యువతకో ప్రేరణ. ఇంతకీ వారేం చేశారంటే..?
వారిది ఏ ఊరు? కుటుంబ నేపథ్యం ఏమిటో పూర్తి వివరాలైతే తెలియదు కానీ.. తాము కన్న కలలకోసం వచ్చిన పలు ఉద్యోగ అవకాశాలను విస్మరించడం, లక్ష్యం కోసం చేసిన ప్రయత్నం, సాధించిన విజయానికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యువతను ఆలోచింప జేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. దీపక్ పటేల్ఎ మ్మెస్సీ డిగ్రీ గ్రాడ్యుయేట్ కాగా, అతని భార్య బీఎస్సీ గ్రాడ్యుయేట్. సమాజం గౌరవించగల డిగ్రీలు కలిగిన వీరు తమకు ₹8,000 నుండి ₹10,000 వరకు జీతాలతో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిరాకరించారు. అలాగనీ లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలను ఎంచుకోవడం కోసం మాత్రం కాదు. ఆఫీసులో కూర్చున్న చోటే చేయగల అలాంటి డెస్క్ జాబ్‌లను వీరు తిరస్కరించి ఆశ్చర్యంగా ట్రక్ డ్రైవర్లుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
ట్రక్ డ్రైవర్ జీతం కూడా పెద్దగా ఏముండదు? అయితే పనిని బట్టి నెలకు రూ. 15 వేల నుంచి మొదలు కొని రూ. 30 వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయినా సరే దీపక్ పటేల్ దంపతులు ఈ ఫీల్డ్‌నే ఎంచుకున్నారు. ఒకప్పుడు ఎవరో ఒకరికి సంబంధించిన ట్రక్కులను నడిపిన వీరు, ఇప్పుడు పలు రాష్ట్రాల మధ్య సొంతంగా ట్రక్(Truck)లను నడిపిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. గతంలో వారికి వచ్చిన డెస్క్ జాబ్ ఆఫర్లకంటే.. ట్రక్ డ్రైవింగ్ ద్వారానే అధిక ఆదాయం వస్తోంది. ఆర్థికంగా స్థిరపడ్డారు. అంటే.. వీరు ట్రక్ డ్రైవింగ్‌ను కేవలం ఒక ఉపాయంగానో, ఉపాధి మార్గంగానో కాకుండా, తమ స్వేచ్ఛ, స్వావలంబన, డ్రీమ్ కోసం కూడా ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఉన్నత చదువులు లేదా డిగ్రీలు కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఉన్నతమైన ఆఫీసు ఉద్యోగాలకు మాత్రమే ప్రయత్నించాలనే మూస పద్ధతులను వీరు బద్ధలు కొట్టారు. శ్రమను గౌరవిస్తేనే ఎక్కడైనా సక్సెస్ సాధించవచ్చునని నిరూపించారు. ఇది కదా ఈతరం యువత నేర్చుకోవాల్సింది! Link






