- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎర్రసముద్రం అడుగున డెత్ పూల్స్.. క్షణాల్లో మట్టుబెట్టేస్తున్నాయి..
దిశ, ఫీచర్స్ : మయామి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం అరేబియా ద్వీపకల్పం, ఆఫ్రికా మధ్య ఉన్న ఎర్ర సముద్రం దిగువన.. "డెత్ పూల్స్" అని పిలువబడే దట్టమైన, ఉప్పగా ఉండే సరస్సులను కనుగొంది. సముద్రపు ఒడ్డున ఏర్పడిన ఈ కొలనులు.. జీరో ఆక్సిజన్ తో దారుణమైన ఉప్ప(హైపర్ సెలైన్)గా ఉన్నట్లు గుర్తించారు. సజీవ సూక్ష్మ జీవులను కలిగి ఉన్న ఈ డెత్ పూల్స్.. ఏ జీవినైనా క్షణాల్లో చంపేయొచ్చని వివరించారు.
ఇది మన గ్రహం మీద జీవం ఎలా ప్రారంభమైంది? నీరు అధికంగా ఉండే ప్రపంచాలపై జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి? అనే దాని గురించి అంతర్దృష్టులను ఇస్తుందని అంటున్నారు. ఖచ్చితంగా ఆక్సిజన్ లేని పరిస్థితులలోనే జీవం భూమిపై లోతైన సముద్రంలో ఉద్భవించిందని నమ్ముతున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. డీప్-సీ బ్రైన్ పూల్స్ ప్రారంభంలో భూమికి గొప్ప పోలికను కలిగి ఉన్నాయని.. ఆక్సిజన్, హైపర్‌సలైన్ లేనప్పటికీ 'ఎక్స్‌ట్రెమోఫైల్' సూక్ష్మజీవులు అని పిలవబడే కమ్యూనిటీతో నిండి ఉన్నాయని చెప్పారు.