బిర్యానీ తింటూ.. కూల్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!

by velandi.Saikiran |   (  Updated:2025-07-06 16:07:48  IST  )

ప్రస్తుత కాలంలో... ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త లైట్

బిర్యానీ తింటూ.. కూల్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో... ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త లైట్ తీసుకున్నా.. పెను ప్రమాదంలో పడ్డట్టే. మనం సంపాదించే డబ్బులకంటే.. ఆరోగ్యమే ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యం. ఎలాంటి చెడు అలవాట్లు లేని వారికి కూడా.. భయంకరమైన వ్యాధులు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బిర్యాని తింటూ కూల్ డ్రింక్ తాగే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.

చాలా మంది బిర్యాని సెంటర్లకు వెళ్లి... కచ్చితంగా కూల్ డ్రింక్ తాగేస్తున్నారు. దాన్ని అలవాటుగా మార్చుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అలా చేస్తే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఒకవేళ బిర్యానీ తింటూ ఫుల్ డ్రింక్ తాగితే.. తిన్న ఆహారం ఏమాత్రం జీర్ణం కాదని అంటున్నారు. భవిష్యత్తులో అజీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ వల్ల జరిగే కార్బోనేషన్.. జీర్ణ క్రియను దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తున్నారు వైద్యనిపుణులు.

జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటే కచ్చితంగా గ్యాస్ ట్రబుల్, మలబద్ధక సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు. ఇలా కూల్ డ్రింక్ తాగితే బరువు కూడా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరి బిర్యానీ తింటూ... కూల్ డ్రింక్ తాగే బదులు కాస్త మజ్జిగ తాగితే బెటర్ అని అంటున్నారు. మజ్జిగ తాగితే... తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని చెబుతున్నారు. మజ్జిగ లేకపోతే... పెరుగు కూడా ట్రై చేయవచ్చని అంటున్నారు.

నోట్: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్య నిపుణులు సూచనలు మేరకు చెప్పినవే. హెల్త్ విషయంలో ఏది చేయాలన్నా వైద్యుల సూచనలు తీసుకోవాలి.

Next Story