పూర్వీకుల ఆహారాన్ని పరిరక్షించేందుకు కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసింది.!

by Daayi Srishailam |

అటవీ ఉత్పత్తులతో అల్లుకున్న వాటిని సంరక్షించేందుకు కంకణం కట్టుకుంది.

పూర్వీకుల ఆహారాన్ని పరిరక్షించేందుకు కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసింది.!
X

దిశ, ఫీచర్స్: అస్సాంలోని మజులీకి చెందిన సింథియా డోలీ తమ పూర్వీకుల అటవీ ఆహార సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు కార్పొరేట్ ఉద్యోగాన్ని, నగర జీవితాన్ని వదిలేసి తిరిగి ఊరికి వచ్చింది. తమ ఆహార సంప్రదాయాలను ముఖ్యంగా అటవీ ఉత్పత్తులతో అల్లుకున్న వాటిని సంరక్షించేందుకు కంకణం కట్టుకుంది.

బొంగులో వెరైటీ..

నగర జీవితంతో ఏదో కోల్పోయిన భావనతో ఊరికి వచ్చిన సింథియా తమ సంస్కృతి, ప్రజలు, వంటకాల గురించే ఎక్కువగా ఆలోచించింది. ఊర్లో "మెనం" అనే హోంస్టే ఏర్పాటుచేసింది. దాని ద్వారా గిరిజన వంటకాల పట్ల ఆసక్తి ఉన్న ప్రయాణికులకు.. పాత ఆహార సంప్రదాయాలు తెలియిని యవతకు వీటిని పరిచయం చేస్తోంది. అలాంటి వంటకాల్లో ప్రత్యేకమైనవి బాంబూ-కుక్డ్ పోర్క్, వైల్డ్ హెర్బ్ స్టికీ రైస్. వీటిని తయారుచేయడం చాలా సహజమైన ప్రక్రియ. వెదురు కాండాలను కట్‌చేసి వంట పాత్రలుగా ఉపయోగిస్తారు. తర్వాత ఫుడ్ ఐటమ్స్‌ను వాటి టేస్ట్‌కు తగ్గట్టు ఒకొక్క పొరగా అమరుస్తారు.

గొట్టాల్లో గోలింపు..

పోర్క్‌ను తకుక్, తజిగ్, తక్పియాంగ్, పక్కోమ్, మర్సాంగ్, బోన్ తులఖీ వంటి అటవి ఔషధాలతో కలుపుతారు. వీటిని సమీప అడవుల నుంచి తాజాగా సేకరిస్తారు. పోర్క్‌ను చూర్ణం చేసిన ఆకులు, టమోటా, అల్లం, కింగ్ చిల్లీ, మస్టర్డ్ ఆయిల్, కాజీ నేము, కొంత వెదురు రసంతో మెరినేట్ చేసిన తర్వాత నానబెట్టిన స్టికీ రైస్‌తో కలిపి వెదురు గొట్టాలలో నింపుతారు. వీటిని కట్టెల మంటపై వండుతారు. వెదురు గొట్టాలు కాల్చినప్పుడు నల్లగా మారతాయి. చివరగా విడదీసినప్పుడు స్వచ్ఛమైన మట్టివాసన వస్తుంది. పోర్క్ వెన్నలాంటి మృదువుగా మారుతుంది. బియ్యం వెదురు సూక్ష్మ రుచిని పూర్తిగా గ్రహిస్తుంది.

సాంస్కృతిక వారసత్వం..

సింథియా అందించే ఆహారం కేవలం భోజనం మాత్రమే కాదు. ఇది వాళ్ల సంస్కృతి, మూలాల పట్ల ప్రేమ వ్యక్తీకరణ. ఈ పోర్క్-అండ్-రైస్ వంటకం బాంబూ షూట్ కింగ్ చిల్లీ పికిల్, ఖరోలీ, ఇంట్లో తయారు చేసిన వైట్ రైస్ బీర్ అపాంగ్‌తో పాటు అందించబడుతుంది. ఇది ఒక ఆత్మీయమైన వంటకాల సమాహారంగా చెప్పుకోవచ్చు. దీనినిలాగే సంరక్షించి ప్రయాణికులకే కాక భవిష్యత్ తరాలకూ అందించాలనేది తన లక్ష్యం. "మెనం" హోంస్టే ఇప్పుడొక జీవన సంగ్రహాలయంగా నిలుస్తోంది. సంస్కృతిని కాపాడుతూనే సమాజాన్ని ఒకచోట చేరుస్తోంది.

Next Story