సరికొత్త మోసాలకు తెరతీస్తోన్న సైబర్ నేరగాళ్లు

by Yella Dhawani Reddy |

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు (Cyber criminals) రెచ్చిపోతున్నారు.

సరికొత్త మోసాలకు తెరతీస్తోన్న సైబర్ నేరగాళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు (Cyber criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. బ్యాంకు అధికారులమని చెప్పి, ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, OTP లేదా బ్యాంక్ వివరాలు సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరాల (Cyber crime) నుంచి రక్షణ పొందేందుకు ఈ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయాలని పలు నంబర్లను ఖాతాదారులకు మెసేజుల రూపంలో పంపుతున్నారు. ప్రముఖ బ్యాంకుల పేర్లతో ఆ మెసేజులు వస్తుండటంతో ప్రజలు నమ్మి మోసపోతున్నారు. అందుకే సైబర్ నేరాల నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ ఖాతాలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా బ్యాంక్‌ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సైబర్ నిపుణులు సూచించారు. అనుమానాస్పద మెసేజులు వస్తే, వాటిని తక్షణమే తొలగించాలి లేదా సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వ అధికారులు, సైబర్ క్రైమ్ విభాగాలు కూడా ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు.

Next Story