- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు Gmail యూజర్లా..? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయకపోతే రిస్క్‌లో పడ్డట్టే!
ముఖ్యంగా జీమెయిల్ సెట్టింగ్స్‌లోని ‘Smart Features’ ద్వారా యూజర్ల ప్రైవేట్ డేటా పలు ఇతర ఏఐ ఫీచర్ల కోసం ఉపయోగపడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : మీరు జీమెయిల్ (Gmail) యూజర్లా? అయితే ఒక ముఖ్యమైన సెట్టింగ్‌ను ఆఫ్ చేసుకోవడం బెటర్ అంటున్నారు సైబర్ నిపుణులు. ఎందుకంటే.. ఏఐ సాంకేతికత పెరుగుతున్న తరుణంలో యూజర్లను ఆటోమేటిక్ ఆప్ట్-ఇన్ (Automatic Opt-in) చేసి, వారి ఈమెయిల్‌లు, ప్రైవేట్ మెసేజ్‌లు, అటాచ్‌మెంట్ల(Personal & Work Emails)ను, ఏఐ మోడల్స్ శిక్షణకు ఇతరులు ఉపయోగించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా జీమెయిల్ సెట్టింగ్స్‌లోని ‘Smart Features’ ద్వారా యూజర్ల ప్రైవేట్ డేటా పలు ఇతర ఏఐ ఫీచర్ల కోసం ఉపయోగపడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా జెమిని ఏఐ మోడల్ శిక్షణ కోసం కూడా వినియోగిస్తున్నారనే ఆందోళనలు సైతం ఇటీవల వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దీనిపై క్లాస్-యాక్షన్ లావాదేవీలు కూడా ప్రారంభమైనట్లు పలువురు చెబుతున్నారు. గూగుల్ మాత్రం ఈ ఆందోళనలను తప్పుపడుతూ, జీమెయిల్ కంటెంట్‌ను జెమిని ఏఐ మోడల్ శిక్షణకు ఉపయోగించడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రైవసీ గురించి ఆందోళన ఉన్నవారు తప్పనిసరిగా ఆప్ట్-అవుట్ చేసుకోవడం సురక్షితమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
డెస్క్ టాప్‌లో..
డెస్క్‌టాప్‌లో అయితే జీమెయిల్‌లో పైన ఉన్న గేర్ ఐకాన్ క్లిక్ చేసి → See all settings → General ట్యాబ్‌లోకి వెళ్లండి. తర్వాత “Smart features” ఆప్షన్‌ను అన్‌చెక్ చేయండి. ఆ తర్వాత Manage Workspace smart feature settings క్లిక్ చేసి, అక్కడ ‘‘Smart features in Google Workspace’’ అలాగే “Smart features in other Google products”ను కూడా ఆఫ్ చేయండి.
మొబైల్ యాప్‌లో..
Settings → Data privacy → “Smart features”ను ఆఫ్ చేయండి. అదే విధంగా Google Workspace సెట్టింగ్స్‌లో కూడా ఆప్ట్ - అవుట్ చేయాలి. మీకు ఒకటికి మించి గూగుల్ అకౌంట్స్ ఉంటే.. ప్రతీ ఖాతాకు విడి విడిగా ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. జీమెయిల్‌లో ఈ సెట్టింగ్ ఆఫ్ చేయడం వల్ల Smart Compose, Smart Reply, స్పెల్లింగ్ చెక్, గ్రామర్ చెక్ , ఆటో-కరెక్ట్, ఈమెయిల్ ఆటో ఫిల్టరింగ్ (Promotions, Social) వంటి సౌకర్యాలు కూడా పనిచేయవు. కాబట్టి ప్రైవసీ ముఖ్యమా, సౌకర్యాలు ముఖ్యమా అనేది ఎవరికి వారు నిర్ణయించుకొని అవసరమైన సెట్టింగ్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






