- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video : It's amazing.. పార్కింగ్ రోబోట్స్ కూడా వచ్చేశాయ్‌గా..!!

దిశ, ఫీచర్స్ : పార్కింగ్.. మెట్రో సిటీస్‌లో ఇదో సమస్యగా మారుతోంది. ఇంటి ముందు గానీ, వర్క్ ప్లేస్‌లలో గానీ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ వాహనాలు నిలపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బయట రోడ్లు, పార్కులు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద కూడా అదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఇరుకిరుకు స్థలం, కొన్నిచోట్ల నో పార్కింగ్ బోర్డులు దర్శనమిస్తుంటాయి. దీంతో ఉన్న చిన్న స్థలంలోనే కార్లు, బైకులు పార్క్ చేయడానికి వాహనదారులు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా ప్రస్తుతం పార్కింగ్ రోబోలు సైతం వచ్చేశాయి. అందుకు సంబంధించిన ఓ వీడియోను @gunsrosesgirl3 అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఐటీ కంపెనీలు, పలు ఇతర సంస్థల కార్యాలయాలు సిటీలల్లో చాలా వరకు బహుళ అంతస్థుల్లోనే ఉంటాయి. పార్కింగ్ ప్లేస్‌లు అలాగే ఉంటాయి. దీంతో అక్కడి ఇరికిరుకు స్థలంలో కారు లేదా ఇతర వాహనాలు పార్క్ చేయడం అంత ఈజీ కాదు. ఎంతో అనుభవం, స్కిల్స్ ఉన్న డ్రైవర్లు కూడా సరైన విధంగా పార్క్ చేయడం కష్టమే! ఈ క్రమంలో వాహనాలు గోడలకు లేదా పక్కన ఉండే ఇతర వాహనాలకు రాసుకుపోతుంటాయి. దీంతో వెహికల్ గ్లాసెస్, బాడీ దెబ్బ తింటుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారమే పార్కింగ్ రోబోట్స్.
ఇప్పుడు మనిషి జోక్యం లేకుండానే కార్లను పార్క్ చేయడానికి, బయటకు తీసుకు రావడానికి రూపొందించబడిన ఆటోమేటెడ్ సిస్టమేటిక్ యంత్రాలు. ఆటోమేటెడ్ నావిగేషన్ (automated navigation), లేజర్ గైడెన్స్, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్ (intelligent software) వంటి టెక్నాలజీని యూజ్ చేస్తాయి. ఉదాహరణకు HL Mando'sకు చెందిన పార్కీ (Parikie) వంటి రోబో వాటిని కచ్చితంగా పార్క్ చేస్తుంది. పైగా ఇది ఇతర వాహనాలను పార్క్ చేయడంలో సహాయపడుతుంది. ఇలా అధునాతన పార్కింగ్ రోబోలు రద్దీ స్థలాలు, విమానాశ్రయాలు లేదా లగ్జరీ భవనాల్లో ఎంతో ఉపయోగంగా ఉంటాయి. స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా వాహనాలు దెబ్బతినే రిస్క్‌ను, తద్వారా నిర్వహణ ఖర్చును తగ్గిస్తాయి.