- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై క్రెడిట్ కార్డు మీ డిపాజిట్‌ను సెక్యూర్డ్‌గా ఉంచుకుంటూ క్రెడిట్ బిల్డ్ చేసుకునే సులభమైన మార్గం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి లేదా ఆదాయ ఆధారాలు లేనివారికి ఇదొక మంచి ఎంపిక.
ఏంటీ ఎఫ్‌డీ క్రెడిట్?
ఎఫ్‌డీపై క్రెడిట్ కార్డు అనేది మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బాండ్‌గా ఉంచి బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు పొందే విధానం. మీ డిపాజిట్ మీద వడ్డీ పొందుతూనే క్రెడిట్ కార్డును వినియోగించే అవకాశం అన్నమాట. ఒకవేళ అప్పుగా తీసుకోవాలనుకుంటే అవసరమైన మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవడానికి ఇది ఉపయోగకరమైన సాధనం. వీటినే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులంటారు.
ప్రయోజనాలేంటి.?
ఈజీ అప్రూవల్: ఎఫ్‌డీని బాండుగా ఉంచడం వల్ల బ్యాంకులు తక్కువ డాక్యుమెంటేషన్‌తో వేగంగా అప్రూవల్ ఇస్తాయి. క్రెడిట్ హిస్టరీ గురించి ఎక్కువగా విచారణ అవసరం ఉండదు.
స్కోర్ తక్కువున్నా: తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నాగానీ.. ఎఫ్‌డీపై క్రెడిట్ కార్డు పొందడం సులభం. బాండు ఉన్నందువల్ల బ్యాంక్ రిస్క్ తక్కువగా ఉంటుంది.
సెక్యూర్డ్: సమయానికి బిల్లులు చెల్లించడం.. 30% లోపు క్రెడిట్ వినియోగం ఉంచడం ద్వారా మీరు మెరుగైన క్రెడిట్ స్కోర్‌ను క్రమంగా పెంచుకోవచ్చు. భవిష్యత్‌లో లోన్‌లకు అర్హత పొందే అవకాశం పెరుగుతుంది.
క్రెడిట్ లిమిట్: బ్యాంకులు ఎఫ్‌డీ విలువ ఆధారంగా 75% నుంచి 90% వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తాయి. ఇది ఖర్చులను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
ఆదాయం: ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండుగా ఉంచినా.. దానిపై వడ్డీ లాభం కొనసాగుతుంది. డిపాజిట్లపై ప్రభావం లేకుండా క్రెడిట్ కార్డును వినియోగించుకోవచ్చు.
తక్కువ వడ్డీ: సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు సాధారణంగా అన్‌సెక్యూర్డ్ కార్డుల కంటే తక్కువ వడ్డీరేట్లను కలిగి ఉంటాయి. ఇది తక్కువ ఖర్చుతో కూడిన ఎంపిక.
రివార్డ్స్: సాధారణ క్రెడిట్ కార్డుల మాదిరిగానే క్యాష్ బ్యాక్.. రివార్డులు.. ఆఫర్స్ వంటి అన్ని ప్రయోజనాలు దీనితో ఉంటాయి.
ఏమేం ఉండాలి.?
- ఎఫ్‌డీపై క్రెడిట్ కార్డు పొందాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. ఒకవేళ ఎన్నారై అయితే సరైన అడ్రస్ ఇవ్వాలి.
- కనీసం 18 ఏళ్ల వయసుండాలి.
- సంబంధిత బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉండాలి.
- ఎఫ్‌డీ మొత్తం కనీసం ₹15,000 ఉండాలి. ఇంకా ఒక సంవత్సరం గడువుండాలి.
- బ్యాంక్ కేవైసీ నిబంధనలను అనుసరించాలి.
- ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ లేదా పాన్ కార్డు ఉండాలి.
- అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్, పాన్, లేదా డ్రైవింగ్ లైసెన్స్.
- బ్యాంకు ఇచ్చిన ఎఫ్‌డీ రసీదు ఉండాలి.






