- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వయసులో పెళ్లి చేసుకునే వారే.. ఆ విషయంలో హ్యాపీగా ఉంటారు..!
ఈ వయసులో పెళ్లి చేసుకునే వారే.. ఆ విషయంలో హ్యాపీగా ఉంటారు..!

దిశ, ఫీచర్స్ : సాధారణంగా18 నుంచి 21 ఏండ్లలోపు యువతీ యువకులు పెళ్లి చేసుకోవడానికి అర్హులుగా భావిస్తారు. చట్టపరంగానూ ఇది సమ్మతం. అయితే ఇటీవల చాలా మంది జీవితంలో సెటిల్ అయ్యాక చేసుకోవాలనే ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ దీనివల్ల జంటల్లో విడాకుల రేటు పెరిగే అవకాశం ఉందని ఒక అధ్యయనం పేర్కొన్నది. సాధారణ వయసుకంటే లేటుగా లేదా మరీ త్వరగా జరిగే వివాహాల్లోనూ డివోర్స్ రేట్ అధికంగా ఉండే ఉందని వెల్లడించింది.
ఉటా(Utah) యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త నికోలస్ వోల్ఫింగర్ (Nicholas Wolfinger) నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ గ్రోత్ డేటా ఆధారంగా నిర్వహించిన పరిశోధన ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కూడా 28 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసులో పెళ్లి (Marriage age) చేసుకునే జంటలు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు. జీవితంలో లోయెస్ట్ డివోర్స్ (divorce) రిస్క్‌ను కలిగి ఉంటున్నారు. ఎందుకంటే.. ఈ వయసు పరిపక్వత, సంబంధాల(maturity and relationship )మధ్య సమతుల్యతను సాధిస్తుంది. అంతేకాకుండా ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకునేవారు జీవితంలో స్థిరత్వం (Consistency), ఆర్థిక స్వాతంత్ర్యం (Financial independence), భాగస్వామితో సంబంధంలో అవగాహన కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలిక సంబంధాలను నిర్వహించడంలో కీ రోల్ పోషిస్తుందని అధ్యయనం పేర్కొన్నది.
ఇక 25 ఏండ్లలోపు వివాహం చేసుకునే జంటల్లోనూ విడాకుల రిస్క్ అధికంగా ఉంటోందని అధ్యయనం పేర్కొన్నది. ఎందుకంటే.. ఈ ఏజ్‌లో ఆర్థికంగా లేదా భావోద్వేగపరంగా ఇంకా స్థిరంగా ఉండకపోవడం, జీవిత లక్ష్యాలపట్ల స్పష్టత లేకపోవడం, సంబంధాల నిర్వహణలో అవగాహనా రాహిత్యం వంటివి విడాకులకు దారితీసే అవకాశం ఎక్కువ. అలాగే వివాహం ఆలస్యం చేయడం.. అంటే 35 ఏండ్లు దాటిని తర్వాత పెళ్లి చేసుకునే జంటల్లోనూ డివోర్స్ రిస్క్ పెరిగే చాన్స్ ఉందని అధ్యయనం తెలిపింది. వ్యక్తిగత అలవాట్లు, ఒకే తరహా జీవనశైలికి అలవాటు పడటం, మార్పును కోరుకోకపోవడం, వయసుకు, మనసుకు తగిన భాగస్వామి లభించలేదన్న నిరాశ వంటివి సంబంధాల్లో సమస్యలకు, క్రమంగా విడాకులకు దారితీయవచ్చు. మొత్తానికి 28 నుంచి 32 ఏండ్ల వయసు వివాహానికి అనువైనదని అధ్యయనం స్పష్టం చేసింది. Link






