గొడవలకు బ్రేక్.. కపుల్స్‌ను కలిపేస్తున్న కూల్ థెరపీ!

by B.Srinivas |   (  Updated:2026-01-27 13:51:01  IST  )

నిరంతరం గొడవలు పెట్టుకునే కపుల్స్.. తమ రిలేషన్ బలపడాలంటే కలిసి స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

గొడవలకు బ్రేక్.. కపుల్స్‌ను కలిపేస్తున్న కూల్ థెరపీ!
X

దిశ, ఫీచర్స్: నిరంతరం ఫైటింగ్ చేసుకునే కపుల్స్‌ చిటికెలో కలిసిపోయేందుకు మానసిక నిపుణులు ఓ విలువైన సూచన చేశారు. ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, పిల్లలతో విసిగిపోతూ గొడవలు పెట్టుకుని డిస్టెన్స్ పాటిస్తున్న జంటలు త్వరగా మింగిల్ అయ్యేందుకు కలిసి స్నానం చేయాలంటున్నారు. శృంగారం అవసరం లేకుండానే ఒత్తిడిని తగ్గించి, రిలేషన్‌ను మరింత స్ట్రాంగ్ చేయడానికి ‘Shower Bathing’ ఉత్తమ మార్గాల్లో ఒకటని, దాదాపు 1000 మంది భార్యభర్తల జంటలపై జరిపిన పరిశోధనలో రుజువైనట్లు వెల్లడించారు.

ఎన్ని రోజులు చేయాలి?
ఒకే ఇంట్లో ఉంటూ చిన్న చిన్న మనస్పర్థలతో దూరం అవుతున్న జంటలు లైంగిక చర్యలో పాల్గొనకుండానే స్నానంతో కలిసిపోతారు. ప్రతిరోజు ఇద్దరు కలిసి ఒకేసారి స్నానం చేస్తే కనెక్షన్ మెరుగుపడుతుంది. ఇద్దరి వెచ్చని కౌగిలి, గోరువెచ్చని నీరు, నిశ్శబ్దం ఇద్దరినీ ఊహించని రీతిలో పరవశింపజేస్తుంది. ఈ లోకాన్ని మరిచి తనవితీరా షవర్ బాథింగ్ ఆస్వాదిస్తారు. ఇదే వారి మధ్య బలమైన సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా ఇలా ఒక వారం రోజులు చేస్తే తొందరగా కలిసిపోతారని, ఆ తర్వాత ప్రతిరోజు అలాంటి అనుభూతిని కోరుకుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

- గోరువెచ్చని నీటితో కలిసి స్నానం చేయడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ (Oxytocin) అనే హార్మోన్ విడుదలవుతుంది.-
- దీనిని ‘లవ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఇది అలసటను, మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది.
- ఈ ప్రక్రియద్వారా ఆక్సిటోసిన్, Binding హార్మోన్స్ వేగంగా రిలీజ్ అవుతాయి. సాధారణ ఆచారాలు, వాటి మధ్య భాగస్వామ్య సంబంధాల్లోనూ ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి.
- ఒకరికొకరు సోప్, షాంపూ రుద్దుకోవడం లేదా తల స్నానం చేయించుకోవడం వంటి చిన్న చిన్న పనులు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, కేరింగ్‌ను బలపరుస్తాయి.
- ఇది శారీరక ఆకర్షణతో పాటు మానసిక సాన్నిహిత్యాన్ని కూడా పెంపొందిస్తుంది.
- కలిసి స్నానం చేయడం వల్ల భాగస్వాముల మధ్య శరీర ఆకృతికి సంబంధించిన బిడియం తొలిగిపోతుంది.
- ఒకరి బాడీని మరొకరు గౌరవించడం, అంగీకరించడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపుఅవుతుంది.




Next Story