Toothache: కూల్ వెదర్‌ కారణంగా పంటినొప్పి.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం!

by Javid Pasha |

Toothache: కూల్ వెదర్‌ కారణంగా పంటినొప్పి.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం!

Toothache: కూల్ వెదర్‌ కారణంగా పంటినొప్పి.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
X

దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం.. ఈ సమయంలో పంటినొప్పి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా దంతక్షయం, చిగుళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలు పంటినొప్పికి దారితీస్తుంటాయి. కూల్ వెదర్ కారణంగా అవి మరింత అధికం అవుతాయి. ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు. అయితే వెంటనే ఆస్పత్రికి వెళ్లలేని సందర్భాల్లో తక్షణ ఉపశమనం కలిగించడంలో కొన్ని హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అవేంటో చూద్దాం.

లవంగం నూనె

పంటినొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు పెయిన్ ఉన్న భాగంలో లవంగం నూనె రాయడం, సున్నితంగా రుద్దడం వంటివి చేయాలని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కొద్ది క్షణాల్లోనే పెయిన్ తగ్గుతుంది. ఒకవేళ లవంగం నూనె అందుబాటులో లేకపోతే లవంగాలను నమలడం ద్వారా పెయిన్ రిలీఫ్ పొందవచ్చు. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నివారణగా పనిచేస్తాయి.

సాల్ట్ వాటర్, పసుపు

దంతాల్లో నొప్పి, చిగుళ్లవాపు వంటి సమస్యలకు ఉప్పునీరు చక్కటి పరిష్కారంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఉప్పును కలిపి ఐదారుసార్లు పుక్కిలిస్తే చాలు. నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గుతాయి. ఇలా అప్పుడప్పుడూ చేయడంవల్ల దంతాల్లో సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించచ్చు. అలాగే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి పంటి నొప్పికి చక్కటి పరిష్కారంగా పేర్కొంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని, అందులో కొద్దిపాటి నీరు లేదా కొబ్బది నూనె కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. నొప్పి ఉన్న పంటి భాగంలో 10 నుంచి 15 నిమిషాలు ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story