ప్రకృతి అందాల పొదరిళ్లు.. బయోఫిలిక్ డిజైనింగ్ ఇండ్లపై పెరుగుతున్న ఆసక్తి..!

by Javid Pasha |

బయోఫిలిక్ ఇంటీరియర్ డిజైన్ అంటే ప్రకృతితో మమేకమవ్వడం, ప్రస్తుతం ఈ డిజైన్‌ను నివాస, వాణిజ్య నిర్మాణ రంగంలో విరివిగా వాడుతున్నారు.

ప్రకృతి అందాల పొదరిళ్లు.. బయోఫిలిక్ డిజైనింగ్ ఇండ్లపై పెరుగుతున్న ఆసక్తి..!
X

దిశ,మేడ్చల్ బ్యూరో : సహజమైన కాంతి, ఇండోర్ మొక్కలు.. కమ్యూనిటీ గార్డెన్‌లతో నిండిన పొదరిళ్లపై సిటీ జనాలు ఆసక్తి చూపుతున్నారు. ‘బయోఫిలిక్ డిజైన్ల’తో తమ సొంతిళ్లల్లో పచ్చని ప్రకృతిని క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన ఈ ట్రెండ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో విస్తరిస్తోంది. దీంతో బయోఫిలిక్ డిజైన్లతో నిర్మిస్తున్న భవనాలకు డిమాండ్ పెరుగుతున్నదని రియల్ ఏస్టేట్ రంగం నిపుణలు చెబుతున్నారు.

‘బయోఫిలిక్’ డిజైన్లతో ప్రశాంతత..

‘బయోఫిలియా’ థియరీ నుంచి బయోఫిలిక్ ఉద్భవించింది. అక్షరాలా జీవితం లేదా జీవుల పట్ల ప్రేమ అని దీని అర్ధం. బయోఫిలిక్ ఇంటీరియర్ డిజైన్ అంటే ప్రకృతితో మమేకమవ్వడం, ప్రస్తుతం ఈ డిజైన్‌ను నివాస, వాణిజ్య నిర్మాణ రంగంలో విరివిగా వాడుతున్నారు. ఇందులో భాగంగా ఇంట్లో కావాల్సినన్ని ఇండోర్ మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనిటీగార్డెన్‌లు నిర్మించి పచ్చని ప్రకృతిని సృష్టిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవన విధానాన్ని ఇంట్లోనే అందుబాటులో ఉండేలా గృహాలు నిర్మిస్తున్నారు. అందుకోసం కలప, రాయి, టెర్రకోట్ వంటి సహజ పదార్థాలను ప్లోరింగ్, అలంకరణలో ఉపయోగిస్తున్నారు.

నిర్వహణ భారం తగ్గుతుంది

యాంత్రిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఉప కరణాలను(accessories) వాడుతున్నారు. లగ్జరీ, సౌదర్యంతో పాటు ఈ తరహా ప్రాజెక్ట్‌లలో మృదువైన ఫినిషింగ్, ఆధునిక డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. ఇవి కొనుగోలుదారులు ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యవరణ అనుకూలంగా ఉంటాయి. కొంపల్లి, దుండిగల్, మల్లంపేట, నిజాంపేట, బౌరంపేట, ఘట్ కేసర్, శామీర్ పేట, మేడ్చల్, కీసర, పెద్ద అంబర్ పేట, మణికొండ, కొత్తూర్, పటాన్ చెరువు, మోకిలా, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో ఇటువంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి కనెక్టివిటీతోపాటు కొనుగోలు దారులు హైవేలు, మెట్రో లైన్‌లు, సామాజిక, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రాపర్టీలను కోరుకుంటున్నారు.

Next Story