- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా ఆర్డర్ చేయగానే.. ఇలా వచ్చి వాలిపోతాయ్..! ‘డ్రోన్ డెలివరీ’ టెక్నాలజీపై నిపుణుల ఫోకస్
అలా ఆర్డర్ చేయగానే.. ఇలా వచ్చి వాలిపోతాయ్..! ‘డ్రోన్ డెలివరీ’ టెక్నాలజీపై నిపుణుల ఫోకస్

దిశ, ఫీచర్స్ : కోరుకున్న వస్తువులో, ఆహార పదార్థాలు ఇలా ఆర్డర్ చేయగానే అలా గాల్లో వచ్చి కళ్లముందు వాలితే ఎంత బాగుంటుంది! ఈ కలను నిజం చేసేందుకు సాంకేతిక నిపుణులు ఎంతో కాలంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే డ్రోన్లు, జెట్ ప్యాక్‌లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ఇవి పరిమిత స్థాయిలోనే ఉంటున్నాయి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో డ్రోన్ డెలివరీ ద్వారా కోరుకున్న వస్తువులను తెప్పించుకోవడానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయడానికి గల మార్గాలను నిపుణులు అన్వేషిస్తున్నారు. పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
*డ్రోన్ డెలివరీ : జెట్స్ పిజ్జా, పనేరా బ్రెడ్, డొమినోస్ వంటి కంపెనీలు అమెరికాలో జిప్‌లైన్, ఫ్లైట్రెక్స్ వంటి సంస్థలతో డ్రోన్ డెలివరీని పరీక్షిస్తున్నాయి. ఉదాహరణకు, జెట్స్ పిజ్జా 2025 నుండి డెట్రాయిట్‌లో డ్రోన్‌లతో పిజ్జాలు డెలివరీ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంకా విస్తరించలేదు. అక్కడక్కడా ఇవి పనిచేస్తున్నాయి. 8 పౌండ్ల వరకు బరువును మోసుకెళ్లగలవు. అయితే, బరువు పరిమితులు, వాతావరణం, ప్రవైసీ ఇష్యూస్ (Privacy Issues) వంటి సవాళ్లు ఉన్నాయి.
*డెలివరీ రోబోట్స్: కివిబోట్స్, స్టార్‌షిప్ టెక్నాలజీస్ వంటి రోబోట్స్ అమెరికా యూనివర్సిటీల్లో ఫుడ్ డెలివరీలకు ఉపయోగించబడుతున్నాయి. ఇవి సెన్సార్లు, కెమెరాలతో నగర వీధుల్లో ఆటోమేటిగ్గా నావిగేట్ చేస్తాయి. పిజ్జా, బర్గర్స్ వంటివి డెలివరీ చేస్తాయి.
*పిజ్జా వెండింగ్ మెషీన్స్ : పిజ్జాఫోర్నో, ఏపీఐ టెక్ వంటి సంస్థలు 24/7 అందుబాటులో ఉండే ఆటోమేటెడ్ పిజ్జా మెషీన్లను అందిస్తున్నాయి. ఇవి 12- అంగుళాల పిజ్జాలను 3 నిమిషాల్లో బేక్ చేసి అందిస్తాయి. కానీ డెలివరీ కంటే ఆన్-సైట్ సర్వీస్‌కు ఎక్కువగా ఉపయోగపడతాయి.
*జెట్ ప్యాక్ డెలివరీ: డొమినోస్ 2023లో ఇంగ్లాండ్‌లోని గ్లాస్టన్‌బరీ ఫెస్టివల్‌లో గ్రావిటీ ఇండస్ట్రీస్‌తో కలిసి జెట్ ప్యాక్‌లతో పిజ్జా డెలివరీని ప్రయోగాత్మకంగా చేసింది. ఈ జెట్‌సూట్‌లు రెండు పిజ్జాలను మాత్రమే మోసుకెళ్లగలవు. ఒక్కోటి సుమారు రూ. 4 కోట్ల 3 లక్షల 30 వేల 500 రూపాయలు($483,000) ఖరీదు చేస్తాయి. కాబట్టి వాణిజ్యపరంగా ఇవి ఇంకా ఆచరణీయం కాదు. ఇది ప్రచార ఈవెంట్‌గా ఎక్కువగా ఉంది. రోజువారీ డెలివరీలకు ఉపయోగించబడలేదు. జెట్ ప్యాక్‌లు ప్రస్తుతం సైనిక, అత్యవసర సేవల్లో (Ex: British Air Ambulance)ఎక్కువగా పరీక్షించబడుతున్నాయి.






