Arm Pain : కుడి భుజంజలో తరచుగా నొప్పి.. లైట్ తీసుకునేరు!

by Javid Pasha |

Arm Pain : కుడి భుజంజలో తరచుగా నొప్పి.. లైట్ తీసుకునేరు!

Arm Pain : కుడి భుజంజలో తరచుగా నొప్పి.. లైట్ తీసుకునేరు!
X

దిశ, ఫీచర్స్ : కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి నొప్పి, కండరాల నొప్పి మాత్రమే కాదు, తరచుగా భుజం, పొత్తి కడుపులో నొప్పి వస్తుంటే కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే.. అది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య పలువురిని వేధిస్తోంది. గాల్ బ్లాడర్‌లో కొవ్వు, బిలిరుబిన్, కాల్షియం లవణాలు పేరుకుపోయి చిన్న చిన్న రాళ్లుగా మారడాన్నే గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా పిత్తాశయంలో రాళ్లు అంటారు.

*తరచుగా భుజం నొప్పి, పొత్తి కడుపులో నొప్పిని ఎదుర్కొంటుంటే గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్యగా అనుమానించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు వికారం, జ్వరం, కామెర్లు, మలబద్ధకం, యూరిన్ కలర్ మారడం వంటి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తాయి. కాగా పిత్తా శయంలో రాళ్లు ఉన్నప్పుడు పొట్ట కుడివైపు, ఎగువ పొత్తి కడుపు మధ్యలో తీవ్రమైన నొప్పి సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

*గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నవారిలో కనిపించే మరో లక్షణం అజీర్తి లేదా కడుపులో ఉబ్బరం. ఆహారం తిన్న తర్వాత, ముఖ్యంగా పాలు, పెరుగు, మాంసం వంటివి త్వరగా అరగవు. అలాగే యూరిన్ కలర్ కాస్త డార్క్‌గా మారవచ్చు. తరచుగా వికారం, వాంతులు, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు తరచుగా సంభవిస్తుంటాయి. లక్షణాలు రిపీట్ అవుతుంటే మాత్రం ప్రమాదకర పరిస్థితిగా భావించి వైద్య నిపుణులను సంప్రదించాలి. గాల్ బ్లాడర్ రాళ్లు చిన్నగా ఉంటే మెడిసిన్ ద్వారా నయం కావచ్చు. కానీ వాటి సైజ్ సాధారణంకంటే పెరిగితే మాత్రం శస్త్ర చికిత్స అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

*అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడేందుకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకొని నివారించడం ద్వారా ముందు జాగ్రత్త పడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన కేర్ తీసుకోవాలి. అనారోగ్యాలకు కారణం అయ్యే జంక్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అట్లనే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే అన్ని ఆహారాలు మేలు చేస్తాయి. ఇక అధిక బరువు సమస్య ఉన్నవారు ఒకేసారి బరువు తగ్గాలనే ప్రయత్నంలో భాగంగా తినకుండా ఉండే పరిస్థితులు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్‌కు కారణం కావచ్చు. దీంతో పాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్, ముఖ్యంగా నడక, సైక్లింగ్, వారినికి కనీసం 150 నిమిషాలు లేదా రోజుకు 30 నిమిషాల వ్యాయామం వంటివి కూడా పరోక్షంగా గాల్‌ బ్లాడర్ సమస్య రాకుండా సహాయపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story