సమ్మర్‌లో తరచూ అక్కడ చెమట పుడుతుందని బయటకు వెళ్లట్లేదా?.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేయడం పక్కా!

by Gantepaka Srikanth |

చాలా మంది మహిళలకు వక్షోజాల కింద చెమటలు పడుతుంటాయి. దీని వల్ల చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు.

సమ్మర్‌లో తరచూ అక్కడ చెమట పుడుతుందని బయటకు వెళ్లట్లేదా?.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేయడం పక్కా!
X

దిశ, ఫీచర్స్: చాలా మంది మహిళలకు వక్షోజాల కింద చెమటలు పడుతుంటాయి. దీని వల్ల చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఇలాంటి సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలన్నా.. కనీసం బయటకు పోవాలనుకున్నా ఆలోచిస్తారు. ఇలాంటి వారి కోసమే ప్రత్యేక ప్రొడక్ట్ రూపొందించింది ఎరిన్ రాబర్ట్ సన్. టవల్ కమ్ బ్రా మాదిరిగా వినియోగించగలిగే ఈ టా-టా టవల్ ఐడియా ఎలా వచ్చింది? అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం.


లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఎరిన్ రాబర్ట్‌సన్ ఫస్ట్ డేట్‌కు వెళ్తున్నాననే ఎగ్జైట్మెంట్‌తో త్వరగా లేచి ఫ్రెష్ అయింది. మరింత అట్రాక్టివ్‌గా, అందంగా కనిపించాలని బాత్రూమ్‌లోనే గంటకుపైగా స్పెండ్ చేసింది. కానీ ఆమె ఆనందం నిమిషాల్లోనే నీరుగారిపోయింది. వక్షోజాల కింద చెమట రావడంతో ఇలా ఎలా వెళ్తానని ఆలోచించి చెమటను తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. చిన్న టవల్‌ను ఛాతీ కింద పెట్టడం, బేబీ పౌడర్ వాడటం, టీ-షర్ట్‌ను ట్రై చేయడం.. కానీఇవేవీ సక్సెస్ కాలేదు. ఎలాగోలా ఫస్ట్ డేట్ కానిచ్చేసిన ఆమె.. దీనికో సొల్యూషన్ కనిపెట్టాలని ఆలోచిస్తూ పడుకుంది. ఈ క్రమంలోనే ఆ రోజు అర్ధరాత్రి స్పెషల్ టవల్ ఐడియా తట్టింది. మెడ చుట్టూ ఉంటూ ఛాతీని ఆవరించి.. చెమటను ఆపగలిగేలా ప్రొడక్ట్ డిజైన్ చేయాలనుకుని ఫిక్స్ అయింది. బ్రా లాగా గట్టిగా కాకుండా సౌకర్యవంతంగా ఉండాలని అనుకుంది. ఇంట్లోని టవల్‌లను కత్తిరించి ప్రయోగాలు చేస్తూ ఒక ప్యాటర్న్ తయారు చేసింది. చాలా ప్రయత్నాల తర్వాత ఛాతీని ఎత్తి వేరు చేసే కప్పులతో మెత్తని, చెమటను పీల్చే ఒక హాల్టర్ స్టైల్ టవల్ రూపొందించింది.

ఈ ప్రొడక్ట్ ముందుగా స్నేహితులతో షేర్ చేసుకుంది. ఛాతీ కింద దద్దుర్లతో బాధపడుతున్న ఓ స్నేహితురాలు.. ఈ టవల్ వల్ల ఆ ప్రాంతం పొడిగా ఉండి చర్మం మెరుగైందని చెప్పింది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు దీని మెత్తని రేయాన్ లైనర్‌ను ప్రశంసించారు. సున్నితమైన చర్మానికి సౌకర్యంగా ఉండి, పాల చుక్కలను పీల్చుకుందని, కంఫర్టబుల్‌గా అనిపిస్తుందని చెప్పారు. దీంతో 2017లో ఎరిన్ టా-టా టవల్ విడుదల చేయగా ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. దీనిని బూబ్ హామాక్ అని కొందరు ఆటపట్టించినా.. అమ్మకాలు మాత్రం ఆగలేదు. 2018లో అమెరికా టీవీ షో షార్క్ ట్యాంక్‌లో పాల్గొన్న ఆమె.. లక్షల డాలర్ల ఆఫర్ అందుకుంది కానీ తర్వాత రద్దు చేసుకుంది. చేతితో తయారైన ఈ టవల్‌లు ఒక్కొక్కటి $45 ధరతో వేగంగా అమ్ముడుపోయాయి. 2023 నాటికి $1 మిలియన్ అమ్మకాలను దాటాయి. మొత్తానికి తన సమస్య నుంచి విముక్తి పొందే క్రమంలో రూపొందించిన ఈ ప్రొడక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు రిలీఫ్ ఇస్తుండటంతో టా-టా టవల్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా వృద్ధి చెందుతోంది.

Next Story