- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Coconut Water : కొబ్బరి నీళ్లు.. చలికాలంలో తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
దిశ, ఫీచర్స్ : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నందున వెంటనే శక్తినిస్తాయి. వేసవిలో అయితే వీటిని తాగడానికి ప్రతీ ఒక్కరు ఇష్టపడతారు. అయితే చలికాలంలో తాగవచ్చా? తాగితే శరీరంలో జరిగే మార్పులేమిటి? అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తం అవుతుంటాయి. అయితే వింటర్‌లో కోకోనట్ వాటర్ తాగడంవల్ల ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు నిపుణులు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చునని చెబుతున్నారు. పైగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
కొబ్బరి నీళ్లలో మినరల్స్, విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులోని విటమిన్ సి, విటమిన్ బి వంటివి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక శీతాకాలంలో వెదర్ కూల్‌గా ఉన్నప్పటికీ వివిధ అనారోగ్యాల రీత్యా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ తలెత్తడం సాధారణమే. అయితే కొబ్బరి నీళ్లు తాగడంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
చర్మ సంరక్షణకు మంచిది
మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో స్కిన్ ప్రాబ్లమ్స్ అధికంగా వస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిబారుతుంది. ఇలాంటప్పుడు కొబ్బరి నీళ్లు అప్పుడప్పుడూ తాగుతూ ఉంటే డ్రై స్కిన్ వల్ల తలెత్తే సమస్యలు పోతాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి వింటర్‌లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జలుబు, ఫీవర్ వంటివి దూరం అవుతాయి. ఫైబర్ కంటెంట్ వల్ల అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటివి తగ్గుతాయి. బాడీలో సోడియం లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కొబ్బరినీళ్లలో ఉండే పొటాషియం సహాయపడుతుంది. అధిక రక్తపోటును, అధిక బరువును తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడంలో కొబ్బరి నీళ్లు అద్భుత పానీయం.