విచిత్రంగా బొద్దింకల సంభోగం.. అందుకే మగవారిని హేట్ చేస్తాయట!

by Disha Web Desk 5 |
విచిత్రంగా బొద్దింకల సంభోగం.. అందుకే మగవారిని హేట్ చేస్తాయట!
X

దిశ, ఫీచర్స్: ఒక మగ బొద్దింక ఆడ బొద్దింకతో జతకట్టాలని కోరుకున్నప్పుడు.. అది టెర్గాల్ గ్రంథి నుంచి విడుదలైన చక్కెరలు, కొవ్వులను అందిస్తుంది. ఒక పురుషాంగంతో ఫిమేల్ కాక్రోచ్‌ను ఆనందపరిచే మగ బొద్దింక.. మరో పెనిస్ ద్వారా స్పెర్మ్ ప్యాకేజీని రిలీజ్ చేస్తుంది. ఇదంతా సజావుగా జరిగితే 90 నిమిషాల్లో ఇంటర్‌కోర్స్ పూర్తవుతుంది కానీ కొంచెం తేడా జరిగినా ఆ ప్రదేశంలో బొద్దింకల జనాభా భారీగా ఉత్పత్తి అయ్యేందుకు కారణమవుతోంది. వీటిని సాంప్రదాయక పురుగుమందులతో నాశనం చేయడం చాలా కష్టం ఎందుకంటే ఈ బొద్దింకలు గ్లూకోజ్ అనే చక్కెర రూపాన్ని హేట్ చేస్తాయి.

సాధారణంగా బొద్దింకలను చంపేందుకు మన పూర్వీకులు పెస్టిసైడ్స్‌లో తీపి పదార్థాలను కలిపి ఎరగా వేసేవారు. ఈ క్రమంలో స్వీట్‌ను ఇష్టపడే కాక్రోచ్‌లు వాటిని తిని చనిపోగా.. తీపి రుచించనివి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. దశాబ్దాలుగా ఈ పద్ధతి కొనసాగుతుండగా.. ఈ తీపి ఇష్టపడని లక్షణం తమ తర్వాతి బొద్దింక తరానికి ట్రాన్స్‌ఫర్ అయిందని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ ఆరోగ్య స్పృహ ఈ విధంగా తర్వాతి తరాలకు చేరిందని, ఇదే ఫీచర్ మగ బొద్దింకతో ఇంటర్‌కోర్స్‌కు ఇంట్రెస్ట్ చూపకపోవడానికి కారణమని తెలిపారు. ఎందుకంటే బొద్దింక లాలాజలం మగవారి కోర్ట్‌షిప్ సమర్పణలో కనిపించే సంక్లిష్ట చక్కెరలను వేగంగా విచ్ఛిన్నం చేయగలదు. అంతేగాకుండా వాటిని గ్లూకోజ్ వంటి సాధారణ చక్కెరలుగా మార్చగలదు. కాబట్టి ఈ గ్లూకోజ్-విముఖత కలిగిన ఆడవారికి ఇంటర్‌కోర్స్ అంతగా ఇష్టముండదని స్పష్టం చేశారు.:Next Story