- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడవలేని వృద్ధులకోసం.. అందుబాలోకి సెల్ఫ్-డ్రైవింగ్ రోబోటిక్ టాయిలెట్!
మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగుల కోసం ఒక చైనీస్ టెక్ కంపెనీ ఏఐ ఆధారిత స్పెల్ఫ్-డ్రైవింగ్ రోబోను తయారు చేసింది.

దిశ, ఫీచర్స్ : వృద్ధాప్యంతోనో, అనారోగ్యంతోనో, వైకల్యంతోనో మంచం దిగలేని పరిస్థితిలో ఉన్నవారు ఎదుర్కొనే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లలేని పరిస్థితుల్లో వీరు చాలా అవస్థలు పడుతుంటారు. అయితే అలాంటి వారికి ఉపశమనం కలిగించే శుభవార్త ఒకటి మన ముందుకు వచ్చింది. ఏమిటంటే.. ఒక చైనీస్ టెక్ కంపెనీ(Yueban) వీరికోసం ప్రత్యేకమైన, ఏఐ ఆధారిత సెల్ఫ్-డ్రైవింగ్ రోబోటిక్ టాయిలెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా పనిచేస్తుంది?
షియావోబాన్ (Xiaoban) అనే పేరుతో చైనీస్ టెక్ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత స్పెల్ఫ్-డ్రైవింగ్ రోబో వృద్ధులకు, రోగ గ్రస్తులకు సౌకర్యంగా మారనుంది. ఎందుకంటే ఇది కాలు కదలచ్చలేనివారి వద్దకు స్వయంగా వెళ్లి, టాయిలెట్ అవసరాల్లో సహాయం చేసి, ఉపయోగించిన తర్వాత తనను తాను శుభ్రం చేసుకుని, దానికోసం కేటాయించిన చార్జింగ్ ప్లేస్ వద్దకు తిరిగి వచ్చేస్తుంది. ఇంట్లో ఎక్కడ ఉన్నా.. వినియోగదారులు ఒక్క రిమోట్ బటన్ నొక్కగానే అది వారి వద్దకు చేరుతుంది. లేదా వాయిస్ కమాండ్ ద్వారా కూడా దీనిని పిలవచ్చు.
అధునాతన ఫీచర్లతో..
సెల్ఫ్-డ్రైవింగ్ టాయిలెట్ రోబో LiDAR, లేజర్, అల్ట్రాసోనిక్ సెన్సార్లను, 3D AI ఆబ్‌స్టాకిల్ అవాయిడెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఇంటి లోపల సురక్షితంగా నావిగేట్ చేస్తుంది. బిడెట్ వాషింగ్, వార్మ్ ఎయిర్ డ్రైయింగ్, UV డిస్‌ఇన్‌ఫెక్షన్ వంటి ఫీచర్లు ఉంటాయి. వేస్ట్‌ను ఆటోమేటిక్‌గా డిస్‌పోజ్ చేస్తుంది. చైనాలో దీని ధర సుమారు సుమారు ₹3.3 లక్షలు నుంచి ₹3.7 లక్షలు ($4,000)గా ఉంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ షాంఘై ఇంటర్నేషనల్ ఏజ్డ్ కేర్ ఎక్స్‌పో 2026లో ప్రదర్శించబడింది. అయితే ఇది ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మార్కెట్లో విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా చైనాలో 30 కోట్లకు పైగా 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఉన్నందువల్ల ఈ రోబోకు డిమాండ్ పెరగుతోందని నిపుణులు అంటున్నారు. వరల్డ్ వైడ్ అందుబాటులోకి వస్తే.. మంచానికే పరిమితమైన వృద్ధులను చూసుకునే వ్యక్తుల(Caregivers)కు పని భారాన్ని తగ్గిస్తుంది.






