చిమ్మ చీకటిలోనూ అన్నీ చూడొచ్చు..! నైట్‌ విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను డెవలప్ చేసిన సైంటిస్టులు

by Javid Pasha |   (  Updated:2025-06-16 11:14:23  IST  )

చిమ్మ చీకటిలోనూ అన్నీ చూడొచ్చు..! నైట్‌ విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను డెవలప్ చేసిన సైంటిస్టులు

చిమ్మ చీకటిలోనూ అన్నీ చూడొచ్చు..!  నైట్‌ విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను డెవలప్ చేసిన సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్ : మనం పగటి పూట మాత్రమే ఏవైనా వస్తువులను క్లియర్‌గా చూడగలం. రాత్రిళ్లు అయితే లైట్లు లేదా వెన్నెల వెలుతురులో మాత్రమే చూడగలం. అంతేకానీ చిమ్మ చీకటి కమ్మిన రాత్రిళ్లు వస్తువులను, పరిసరాలను చూడలేం. చూసినా మసకగా కనిపిస్తాయి. కానీ ఇక నుంచి ఇటువంటి పరిస్థితుల్లో సైతం అచ్చం పగటివేళలా చూసేందుకు ఉపయోగపడే నైట్ విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను చైనీస్ సైంటిస్టులు డెవలప్ చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా!

చిమ్మ చీకటి అలముకున్న అర్ధరాత్రి సైతం, అల్లంత దూరాన ఉన్న వస్తువులను, మనుషులను, జంతువులను చూడటం అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే టెక్నాలజీని సైతం సైంటిస్టులు కనుగొన్నారు. కిలో మీటర్ దూరంలో ఏముందో కూడా చూసేందుకు సహాయపడే టైనీ లెన్సెస్ (Tiny Lenses) అనే పేరుగల నైట్ విజన్ కాంటాక్ట్ లెన్స్ (Night vision contact lens)ను యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా(USTC)కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రముఖ చైనీస్ న్యూరోసైంటిస్టులు టియాన్ ష్యూ (Tian Xue), అండ్ యుక్వియాన్ మా (Yuqian Ma) నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ సరికొత్త ఆవిష్కరణ తెరతీసింది. ఈ లెన్సెస్ సాధారణ దృష్టిని మించి, మానవులు ఇప్పటివరకు చూడని వాటిని కూడా చూడగలిగే సామర్థ్యాన్ని అందిస్తాయని పరిశోధకులు అంటున్నారు.

ఎంతటి గాఢమైన చీకటిలోనైనా చూడగలిగే టైనీ లెన్సెస్ (Tiny Lenses)ను తయారు చేయడానికి పరిశోధకులు ఎంతో కాలంగా పనిచేసి సక్సెస్ సాధించారు. అప్‌కన్వర్షన్ నానోపార్టికల్స్ (UCNPs)ని ఉపయోగించి సూపర్-హ్యూమన్ దృష్టిని సాధ్యం చేయడం ద్వారా ఈ లెన్సెస్ సుదూరంగా ఉన్న వస్తువులను చీకటిలో సైతం చూసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా దృష్టిని మెరుగు పరచడం, వస్తువుల ఉష్ణోగ్రతను కనిపెట్టడం వంటి కారణాలవల్ల ఇవి అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ కార్యకలాపాలలో సైతం విప్లవాత్మక మార్పులను తీసుకురాగలవని పరిశోధకులు చెబుతున్నారు.

Instagram link

Next Story