- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏరియల్ రోబోటిక్ టెక్నాలజీ.. AI డ్రోన్లతో సస్టైనబుల్ పరిష్కారాలు!
ఏరియల్ రోబోటిక్ టెక్నాలజీలో భాగంగా అటానమస్ డ్రోన్లను శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు.

దిశ; ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), అలాగే ఏరియల్ రోబోటిక్ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో సాంకేతిక ప్రాధాన్యతలు మరింత విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా పనుల్లో ఆటోమేటెడ్(autonomous drones) డ్రోన్లు, హ్యూమనాయిడ్ రోబోల అవసరం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు అడవుల పునరుద్ధరణ, కొత్త అడవులు పెంపకం వంటి విషయాల్లో వీటిని ఉపయోగించుకునే పరిశోధనలపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రెసిషన్ నావిగేషన్ సిస్టమ్స్‌తో అమర్చబడిని స్వయం చాలక డ్రోన్ల తయారీపై ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇంతకీ ఏరియల్ రోబోటిక్ టెక్నాలజీతో ఇంకా ఏయే ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అటానమస్ డ్రోన్లు..
ఏరియల్ రోబోటిక్ టెక్నాలజీలో భాగంగా అటానమస్ డ్రోన్లను శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు. వీటితో దూరప్రాంతాలు, అలాగే బీడు భూముల్లో చెట్లు నాటడాన్ని వేగవంతం చేయవచ్చునని చెబుతున్నారు. ఎందుకంటే ఈ డ్రోన్లు బయోడిగ్రేడబుల్ సీడ్ పాడ్స్ (biodegradable seed pods)ను నేలలోకి నేరుగా వేయగల సామర్థ్యాన్ని, సాంకేతికతను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆప్టిమల్ స్పేసింగ్‌ను నిర్ధారించి, మొలకెత్తే రేటును మెరుగుపరుస్తాయి. ఏఐ-డ్రివెన్ మ్యాపింగ్, డేటా అనాలిటిక్స్‌తో కలిపి వినియోగించే ఈ టెక్నాలజీ ద్వారా ఇబ్బందికర పరిస్థితుల్లో మానవ శ్రమ తగ్గి, పర్యావరణానికి మేలు చేస్తుంది.
25 రెట్ల వేగంతో..
ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ వంటి దేశాల్లో AirSeed, Flash Forest వంటి కంపెనీలు ఈ డ్రోన్లను ఉపయోగించి ఒక్క రోజులో వేలాది సీడ్ పాడ్స్ వేస్తున్నాయి. సాంప్రదాయిక పద్ధతుల కంటే ఇవి 10 నుంచి 25 రెట్లు వేగంగా పనిచేస్తాయి. ఇండియాలోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తెస్తే పెద్ద ఎత్తున అటవీ సంరక్షణ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది క్లైమేట్ చేంజ్‌ను ఎదుర్కోవడం, ఎకోసిస్టమ్స్ పునరుద్ధరణ, నేల కోతను తగ్గించడం వంటి లక్ష్యాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
మాన్యువల్ vs ఏఐ డ్రోన్ సీడింగ్
విత్తనాలను నాటడం లేదా సీడ్స్ బాల్స్ విసరడం వంటివి మాన్యువల్ పద్ధతిలో అయితే శ్రమ, అధిక ఖర్చుతో కూడుకున్నది. కానీ ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీతో ఇది చాలా సులభం అవుతుంది. ఎందుకంటే ఈ డ్రోన్లు రిమోట్ ప్రాంతాల్లో, మానవులు వెళ్లలేని ఎడారి ప్రాంతాల్లో, ఎత్తైన పర్వ ప్రాంతాల్లో వెళ్తూ సులభంగా పని చేయగలవు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు తయారు చేస్తున్న ఒక్క అటానామస్ డ్రోన్ ఒక్క రోజులో 40,000 నుంచి లక్షల వరకు సీడ్ పాడ్స్ వేయగలదు. అంతేకాకుండా ఇందులో ఉపయోగించే సీడ్ పాడ్స్‌లో పోషకాలు, ఫంగై, ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఉంటాయి. ఇవి మొలకెత్తడాన్ని, మొక్కల మనుగడ రేటును పెంచుతాయి. ప్రస్తుతం చైనా ఈ రంగంలో చురుకుగా పనిచేస్తోంది. డెజర్టిఫికేషన్‌ను అరికట్టడానికి, పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున ఎకాలజికల్ రెస్టోరేషన్ ప్రోగ్రాములు నడుపుతోంది. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత ఏరియల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.






