- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : పిండం ఎదుగుదలను ట్రాక్ చేసే వూమ్ చిప్..! గర్భస్థ దశలో మిస్టరీలకు చెక్!
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మినియేచర్ ‘వూమ్ ఆన్ ఎ చిప్’ మానవ పిండం గర్భాశయంలో ఎలా ఎదుగుతుందో, ఎలా ఏర్పడుతుందో (implantation) పూర్తిగా అనుకరిస్తుంది.

దిశ, ఫీచర్స్ : ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక పిండం ఎదుగుదల ఎలా ఉంది? ఐవీఎఫ్‌లో అండం, స్పెమ్ సెల్ ఫలదీకరణం సక్రమంగానే జరిగిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రస్తుతం స్కానింగ్ అందుబాటులో ఉంది. అయితే అదనంగా మరో కొత్త టెక్నాలజీని కూడా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జూలాజీకి చెందిన పరిశోధకులు డెవలప్ చేశారు. దీనినే మినియేచర్ ‘వూమ్-ఆన్-ఎ-చిప్’ అని పిలుస్తున్నారు. ఇది గర్భంలో లేదా ఫెర్టిలిటీ సెంటర్లలో ఫలదీకరణ (implantation) తర్వాత పిండం ఎదుగుదలను ఎటువంటి స్కానింగ్ అవసరంలేకుండానే పరిశీలించడంలో సహాయపడుతుందని రీసెర్చర్స్ అంటున్నారు. ఈ పరిశోధనా వివరాలు 2025, డిసెంబర్ సెల్(Cell) జర్నల్‌లో పబ్లిషయ్యాయి. ఆ వివరాలేమిటో చూద్దాం.
చిప్ ఎలా పనిచేస్తుంది?
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మినియేచర్ ‘వూమ్ ఆన్ ఎ చిప్’ మానవ పిండం గర్భాశయంలో ఎలా ఎదుగుతుందో, ఎలా ఏర్పడుతుందో (implantation) పూర్తిగా అనుకరిస్తుంది. కాబట్టి ఇది గర్భం మొదటి దశలను అధ్యయనం చేయడంలో ఎదురయ్యే నైతిక, సాంకేతిక అడ్డంకులను సైతం అధిగమిస్తుంది. పైగా ఈ సిస్టమ్ మైక్రోఫ్లూయిడిక్ చిప్‌పై మూడు డైమెన్షనల్ ఎండోమెట్రియల్ టిష్యూలను(uterine lining) ఉపయోగించి తయారు చేస్తారు. దీంతో అది నిజమైన గర్భాశయం లాగా పనిచేస్తుంది. బయాప్సీ లేదా మెన్‌స్ట్రువల్ బ్లడ్ నుండి తీసుకున్న సెల్స్‌తో కూడా దీనిని తయారు చేయవచ్చు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు నిజమైన మానవ బ్లాస్టోసిస్ట్‌లు అండ్ స్టెమ్ సెల్స్ నుండి తయారు చేసిన ‘బ్లాస్టాయిడ్స్’ను ఇందులో పెట్టగా, పిండం గర్భాశయ లైనింగ్‌తో మొదట కాంటాక్ట్ అవ్వడం, అటాచ్ అవ్వడం, ఆ తర్వాత ఆక్రమించుకోవడం (invade) వంటి అన్ని ముఖ్య దశలను విజయవంతం అయ్యాయి. కాబట్టి ఇది ఎర్లీ పోస్ట్-ఇంప్లాంటేషన్ డెవలప్‌మెంట్‌ను కూడా చూపించింది.
వంధ్యత్వ చికిత్సలకు మేలు
ఈ వూమ్(womb) చిప్ పేషెంట్-స్పెసిఫిక్ తేడాలను కూడా క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే రికరెంట్ ఐవీఎఫ్ (IVF) ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉన్న మహిళల నుండి తీసుకున్న సెల్స్‌తో తయారు చేసిన వూమ్ చిప్‌లలో పిండం ఇంప్లాంటేషన్ గణనీయంగా తగ్గింది. ఇది క్లినికల్ రిజల్ట్స్‌తో సరిపోలింది. దీని సాయంతో 1,000 కంటే ఎక్కువ FDA-ఆమోదిత డ్రగ్స్‌ను స్క్రీన్ చేసి, ఇంప్లాంటేషన్ రేట్లను మెరుగుపరిచే కాంపౌండ్స్‌ను సైతం పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఈ వూమ్ చిప్ అందుబాటులోకి వస్తే వంధ్యత్వాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, ఐవీఎఫ్ సక్సెస్ రేట్లను పెంచడానికి, ఎథికల్‌గా ట్రీట్‌మెంట్స్‌ను టెస్ట్ చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ సాంకేతికత ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు.
Read More..






