Technology: వీడియో గేమ్స్ ఆడటం మంచిదే..! వృద్ధుల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి

by Javid Pasha |   (  Updated:2026-01-13 06:49:49  IST  )

వీడియో గేమ్ ఆడటం వృద్ధులకు మేలు చేస్తుందని, జ్ఞాపకశక్తి , ఆలోచనల్లో వేగం మెరుగుపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Technology: వీడియో గేమ్స్ ఆడటం మంచిదే..! వృద్ధుల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి
X

దిశ, ఫీచర్స్ : తరచుగా స్క్రీన్ ముందు గడపడం, ముఖ్యంగా గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడటం, చూడటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ అది అందరికీ వర్తించదని యూనివర్సిటీ ఆఫ్ అయోవా నిర్వహించిన ఒక పరిశోధనలో వెల్లడైంది. పిల్లలు, యుక్త వయస్కులు వీడియో గేమ్స్ అడిక్షన్ వల్ల నష్టపోతుండవచ్చు. కానీ 50 ఏండ్లు పైబడిన వృద్ధులకు మాత్రం ఇది మేలు చేస్తుందని పేర్కొన్నది. పరిశోధనలో భాగంగా రీసెర్చర్స్ ‘డోర్ టూర్’ అనే గేమ్ ఉపయోగించారు. ఇది మెంటల్ ప్రాసెసింగ్ స్పీడ్ అండ్ స్కిల్స్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

వీడియో గేమ్ పిల్లల ఆరోగ్యంపై, జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమో కానీ.. వృద్ధులకు మాత్రం మేలు చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కేవలం 10 గంటలు మెదడును ఉత్తేజపరిచే (Brain-stimulating) వీడియో గేమ్స్ ఆడితే, జ్ఞాపకశక్తి, ఆలోచనల్లో వేగం మెరుగుపడుతుందని కనుగొన్నారు. అంతేకాదు.. ఆసక్తికమైన వీడియో గేమ్ అధిక వయసుగల వారిలో మెదడు వృద్ధాప్యాన్ని దాదాపు 7 నుండి 10 సంవత్సరాల వరకు ఆలస్యం చేస్తుందని కూడా అధ్యయనంలో తేలింది. ఎందుకంటే బ్రెయిన్-స్టిమ్యులేటింగ్ వీడియో గేమ్ ఆడినవారు ఒక సంవత్సరం తర్వాత కూడా కాగ్నిటివ్ స్కిల్స్‌లో మెరుగుదల చూపారు. అంటే ఇది సాధారణ క్రాస్‌వర్డ్ పజిల్స్ కంటే మరింత ప్రభావవంతమైనది.

బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ గేమింగ్ వాస్తవానికి మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. ఆ సందర్భంలో అది వృద్ధుల్లో రియాక్షన్ టైమ్‌ను షార్ప్ చేస్తుంది. మెదడులోని లెర్నింగ్ ఏరియాల్లో గ్రే మ్యాటర్‌ను వృద్ధి చేస్తుంది. ఇటీవలి (2025) అధ్యయనాలు సైతం బ్రెయిన్ HQ వంటి కాగ్నిటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అసెటైల్‌కోలిన్ (Chemical related to memory and attention) స్థాయిలను 2.3% పెంచుతాయని, ఇది సాధారణ వృద్ధాప్యంలో దశాబ్దకాలంగా జరిగే డిక్లైన్‌ను రివర్స్ చేస్తుందని చూపించాయి. ఇది మెదడు ఏరియాల్లో హిప్పోక్యాంపస్, అలాగే పారాహిప్పోక్యాంపల్ గైరస్ వంటి భాగాల్లో ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది విషయాలపట్ల శ్రద్ధను, నేర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది.

Read More..

రోజూ ఈ సమయంకన్నా తక్కువ నిద్ర.. మీ ప్రాణాలకే ముప్పు : తాజా అధ్యయనంలో వెల్లడి

Next Story