రోజూ ఈ సమయంకన్నా తక్కువ నిద్ర.. మీ ప్రాణాలకే ముప్పు : తాజా అధ్యయనంలో వెల్లడి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-13 06:50:39  IST  )

మనిషి ఆయువు కాలం ఒకప్పుడు నూరేళ్లు ఉండేది. మన అలవాట్లు, లగ్జరీ లైఫ్, ఆరోగ్యంపై శ్రద్ధలేకపోవడం.. వీటన్నింటి కారణంగా సగటు మానవుడి జీవిత కాలం 60 ఏళ్లకు తగ్గింది.

రోజూ ఈ సమయంకన్నా తక్కువ నిద్ర.. మీ ప్రాణాలకే ముప్పు : తాజా అధ్యయనంలో వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి ఆయువు కాలం ఒకప్పుడు నూరేళ్లు ఉండేది. మన అలవాట్లు, లగ్జరీ లైఫ్, ఆరోగ్యంపై శ్రద్ధలేకపోవడం.. వీటన్నింటి కారణంగా సగటు మానవుడి జీవిత కాలం 60 ఏళ్లకు తగ్గింది. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో.. మన జీవితకాలం అంత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి కేవలం ఆహారం తింటే సరిపోదు. కంటికి, శరీరానికి సరిపడేంత రెస్ట్ ఇచ్చేంత నిద్రకూడా ఉండాలి. గజిబిజి.. బిజీ బిజీ టెక్నాలజీ యుగంలో ఎంతమంది తమ నిద్రపై శ్రద్ధ వహిస్తున్నారు? రోజుకు కనీసం 7-8గంటలు అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా నిద్రపోవాలి. కానీ.. ఉద్యోగాలు, డబ్బు సంపాదనలో పడి 5-6 గంటలు పడుకోవడం కూడా గగనమైపోతోంది. ఈ అలవాటు వల్ల మన ఆయుషు తగ్గిపోతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

అమెరికాలో ఒరెగాన్ అనే యూనివర్సిటీ.. అక్కడి ప్రజల నిద్ర అలవాట్లపై తాజాగా పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో రోజుకు కనీసం 7 గంటల కంటే తక్కవగా నిద్రించేవారి ఆయువు తగ్గిపోతున్నట్లు వెల్లడైనట్లు తెలిపింది. స్లీప్ అడ్వాన్సెస్ లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. దానిప్రకారం.. కంటినిండా నిద్రిస్తే తనకు తానుగా చికిత్స చేసుకునే శక్తి శరీరానికి లభిస్తుందని, తరచూ అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని తెలిపింది. అలాగే మెదడు పనితీరు, రోగనిరోధక వ్యవస్థ, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే శక్తి నిద్రకు ఉందని పేర్కొంది. ప్రతిరోజూ 7 గంటలు, కుదిరితే 9 గంటలపాటు నిద్రించేవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

ఈ అధ్యయనం కోసం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నుంచి డేటా సేకరించామని 2019 -2025 వరకూ అమెరికన్ల నిద్ర అలవాట్లను, ఆరోగ్యాన్ని పరిశీలించామని యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్రూ మెక్ హిల్ తెలిపారు.

Read More..

Technology: వీడియో గేమ్స్ ఆడటం మంచిదే..! వృద్ధుల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి

Next Story