- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : గత జ్ఞాపకాలను సృష్టించే కొత్త టూల్.. Ex.skill
ఎవరి తాలూకు జ్ఞాపకాలు, అనుభూతులను అయినా సరే.. ఎక్స్ స్కిల్ ఆధారంగా క్రియేట్ చేసుకొని తిరిగి ఫీల్ అవ్వొచ్చు.

దిశ, ఫీచర్స్ : ముఖ్యమైన జ్ఞాపకాల తాలూకు ఆనవాళ్లను మీరు కోల్పోయారా? సంబంధింత ఫొటోలు, వీడియోలు పోగొట్టుకున్నారా? అయినా డోంట్ వర్రీ.. ఎందుకంటే.. వాటిని తిరిగి అనుభూతి చెందగలిగే అద్భుతమైన అవకాశాన్ని Ex.skill అనే ఓపెన్ సోర్స్ ఏఐ టూల్ కల్పిస్తుంది. దీనిని చైనీస్ డెవలపర్ అయిన therealXiaomanChu అభివృద్ధి చేశాడు. ఇండియన్లకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లైసెన్స్‌తో ఓపెన్ సోర్స్‌గా అందుబాటలో ఉంది. క్లాడ్ కోడ్ లేదా ఓపెన్ క్లా(OpenClaw) వంటి ఏఐ ఎన్విరామెంట్ స్కిల్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇది ఎలా వర్క్ చేస్తుంది? దానివల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా ఉపయోగించాలి?
ఎక్స్.స్కిల్ (Ex.skill) అనేది మొబైల్ యాప్ కాదు, కంప్యూటర్‌లో టెక్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు మాత్రమే సులభంగా ఉపయోగించగలరని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏఐ టూల్ వివిధ జ్ఞాపకాలను క్రియేట్ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. విడిపోయిన ప్రేమికులు, భార్యభర్తలు, స్నేహితులు ఇలా ఎవరి తాలూకు జ్ఞాపకాలు, అనుభూతులను అయినా సరే.. ఈ సాంకేతికత ఆధారంగా చాట్‌బాట్ తయారు చేసుకొని తిరిగి ఫీల్ అవ్వొచ్చు. అందుకోసం ఓల్డ్ చాట్ లాగ్స్, ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులు, షేర్డ్ మెమరీలు వంటి పర్సనల్ డేటాను ఇన్‌పుట్‌గా ఇవ్వాలి. ఇక సదరు వ్యక్తి మాట్లాడే స్టైల్, క్యాచ్ ఫ్రేజెస్, రిప్లై స్టైల్, వాళ్లు కలిసి తిరిగిన ప్రదేశాలు, రిలేషన్‌షిప్ వివరాలు అన్నీ కలిపి, కాపీ చేసి ఏఐ వెర్షన్‌ను క్రియేట్ చేస్తుంది. ప్రధానంగా బ్రేక్ తర్వాత బాధను లేదా దుఃఖాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి ఎమోషనల్ హీలింగ్‌కు సహాయపడుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టూల్ చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తూ చర్చరకు దారిస్తున్నది.
ప్రయోజనాలు
ఎక్స్.స్కిల్ అనే ఏఐ టూల్ ప్రస్తుతంGitHubపై అందుబాటులో ఉంది. చైనాలో లోకల్‌గా రన్ అవుతోంది. యూజర్లు తమ సొంత డేటాను ఉపయోగించి రిలేషన్‌షిప్ మెమరీలను జనరేట్ చేసుకోవచ్చు. కొందరు దీనిని హీలింగ్ టూల్‌గా చూస్తుంటే.. అరుదుగా మరికొందరు ఇది పాత జ్ఞాపకాలను, ఆటాచ్‌మెంట్‌ను పెంచి మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చునని వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి టెక్నాలజీ, ఎమోషన్స్ మధ్య ఉన్న బౌండరీలను ప్రశ్నించే కొత్త ట్రెండ్‌గా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.






