AI wonders : మనుషుల్లేకుండానే ఆ పని చేస్తున్న చైనా..! మొత్తం రోబోలతోనే..!!

by Javid Pasha |

AI wonders : మనుషుల్లేకుండానే ఆ పని చేస్తున్న చైనా..! మొత్తం రోబోలతోనే..!!

AI wonders : మనుషుల్లేకుండానే ఆ పని చేస్తున్న చైనా..! మొత్తం రోబోలతోనే..!!
X

దిశ, ఫీచర్స్ : ‘ఆజ్ కల్ క్యా చల్రా బ్రో.. ?!’ అని ఎవరైనా అడిగితే... ఔర్ క్యా A.I..! అని చమత్కరిస్తున్నారు ఈ మధ్య కొందరు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఆధునిక యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(A.I) గురించి ఎంతలా ఆలోచిస్తున్నదో! ఎందుకంటే భవిష్యత్‌ జాబ్‌మార్కెట్ అంతా దీనిపైనే ఆధారపడి నడుస్తుందనే ప్రచారం ప్రపంచమంతా పాకిపోయింది. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోల హవా నడుస్తోంది. అయితే తాజాగా చైనా మరో అడుగు ముందుకేసింది. ఆ దేశంలోని ఒక డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి మానవ రహితంగా చేపట్టింది. అంటే అక్కడ అన్ని పనులూ రోబోలే చేసేస్తున్నాయి. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

యాంక్యూ డ్యామ్ (Yangqu Dam) అనేది చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక విప్లవాత్మక నిర్మాణం. అయితే ..180 మీటర్ల ఎత్తైన ఈ భారీ ఆనకట్టను పూర్తిగా మానవ రహితంగా చేపడుతున్నారు. అంటే ఆయా పనుల నిర్వహణలో ఎటువంటి మానవ శ్రమలేకుండానే అత్యాధునిక సాంకేతికతను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ(AI) ఆధారిత కట్టింగ్‌ ఎడ్జ్ టెక్నాజీ(Cutting-edge technology), రోబోట్స్‌( AI-Robots), 3D ప్రింటర్ల సమన్వయంతో (coordination with 3D printers) ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టినట్లు అక్కడి సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆటోమేటెడ్ సిస్టమ్ యాంక్యూ డ్యామ్(Yangqu Dam) నిర్మాణ ప్రక్రియలో మరింత సామర్థ్యాన్ని, కచ్చితత్వాన్ని పెంచడమే కాకుండా, నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొనే ప్రమాదాలను నివారిస్తుందని, పనులను సులభతరం చేస్తుందని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story