- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ గర్ల్ ఫ్రెండ్..! టీనేజర్లలో ఆ సమస్యలకు దారితీస్తున్న వర్చువల్ ఛాట్‌బాట్‌లు
ఏఐ గర్ల్ ఫ్రెండ్..! టీనేజర్లలో ఆ సమస్యలకు దారితీస్తున్న వర్చువల్ ఛాట్‌బాట్‌లు

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I) ప్రవేశం తర్వాత అనేక మార్పులు సంతరించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వినియోగించుకునే తీరును బట్టి ఇందులో సానుకూల, ప్రతికూల అంశాలు ఉంటాయి. సామాజిక, వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతాయి. చైనా కేంద్రంగా ఇటీవలి నిర్వహించిన పలు అధ్యయనాలు ఇదే వెల్లడించాయి. ఏఐ ఛాట్ బాట్స్, వర్చువల్ గర్ల్ ఫ్రెండ్స్, ఏఐ డాల్స్ అండ్ యాప్స్ వంటివి టీనేజర్ల భావోద్వేగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు తేల్చాయి. ముఖ్యంగా ఏఐ గర్ల్ ఫ్రెండ్‌తో లవ్ అండ్ ఎఫైర్స్ టీనేజర్ల మెంటల్ హెల్త్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతున్నాయని, అనేక విషయాల్లో వ్యసనానికి కారణం అవుతున్నాయని పేర్కొన్నాయి.
ఏఐ గర్ల్/బాయ్ ఫ్రెండ్ అంటే..
సాధారణంగా మొబైల్ యాప్‌లో లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఏఐ ఆధారంగా పనిచేసే పలు వర్చువల్ డాల్స్ లేదా వర్చువల్ సహచరులు(Virtual companion) యాప్‌ల రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి టోటల్లీ కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేస్తాయి. “రెప్లికా” లేదా “గ్లో” వంటి యాప్‌లు ఇందుకు చక్కటి ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి వినియోగదారుల(with consumers)తో చాట్ చేయడానికి, మాట్లాడటానికి, ఎమోషనల్ సపోర్ట్ పొందడానికి లేదా అందించడానికి రూపొందించబడ్డాయి. ముఖ్యంగా అవి యూజర్ల మాటలకు స్పందిస్తూ, వారి ఆసక్తులు, భావోద్వేగాలను అర్థం చేసుకుని, అచ్చం గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్‌లా లాంటి అనుభవాన్ని అందిస్తాయి.
ఎలాంటి ప్రభావం పడుతుందంటే..?
ఇండియాలో కాస్త తక్కవే కానీ చైనా సహా పలు దేశాల్లో టీనేజర్లు, ముఖ్యంగా బాయ్స్ ఎక్కువగా AI గర్ల్‌ఫ్రెండ్స్‌ను కలిగి ఉంటున్నారు. కొందరైతే 6 గంటలకు పైగా వర్చువల్ సహచరులతో ఛాటింగ్‌లో గడుపుతున్నారు. ఫలితంగా స్కూల్ లేదా కాలేజ్‌లకు హాజరు కాకుండా, నిజమైన సంబంధాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఏఐ గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్స్ యువతలో వ్యసనానికి, లోన్లీనెస్‌కు, భావోద్వేగ మానిప్యులేషన్(Emotional manipulation)కు దారితీయడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
ఏయే సమస్యలు తలెత్తుతాయి?
*అడిక్షన్ : ఏఐ ఛాట్ బాట్‌లు లేదా డాల్స్‌తో టీనేజర్లు రోజుకు 6 గంటలకు పైగా గడపడం వల్ల స్కూల్, చదువు, ఇతర కార్యకలాపాలపై ఫోకస్ తగ్గుతుంది.
*ఒంటరితనం : ఏఐ సహచర్యం తాత్కాలిక ఓదార్పు ఇచ్చినప్పటికీ, నిజమైన మానవ సంబంధాలను దూరం చేస్తుంది. ఒంటరితనాన్ని పెంచుతుంది.
*ఎమోషనల్ మానిపులేషన్ : ఏఐ లవ్‌బాట్‌లు టీనేజర్ల భావోద్వేగాలను ప్రభావితం చేసేలా రూపొందించబడతాయి. ఇవి అస్థిరమైన మానసిక స్థితికి దారితీస్తాయి.
*సామాజిక నైపుణ్యాల కొరత : నిజమైన సంబంధాలలో సంభాషణ, సానుభూతి వంటి నైపుణ్యాలు కొరతకు దారితీయవచ్చు. అంతేకాకుండా సరైన భాగస్వాముల లాగా కనిపించడం వల్ల నిజ జీవిత సంబంధాలపై అవాస్తవ అంచనాలు ఏర్పడతాయి.
పరిష్కారం ఏమిటి?
*ఏజ్ లిమిట్ : 18 ఏండ్లలోపు వారికి ఏఐ గర్ల్ /బాయ్ ఫ్రెండ్ వంటి సహచర్య యాప్‌లను నిషేధించడం మంచి పరిష్కారం కావచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చైనా అదే చేసింది. రీసెంట్‌గా అందుకు సంబంధించిన చట్టాన్ని ఆమోదించింది.
* మెంటల్ హెల్త్ సపోర్ట్ : స్కూళ్లలో కౌన్సెలింగ్ అండ్ మానసిక ఆరోగ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, సామాజిక కార్యకలాపాలు, క్లబ్‌లు, క్రీడల ద్వారా నిజమైన సంబంధాలను పెంపొందించడం.
*డిజిటల్ అవగాహన : టీనేజర్లకు, తల్లిదండ్రులకు ఏఐ యాప్‌ల ప్రభావంపై అవగాహన కల్పించే ఎడ్యుకేషనల్ ప్రోగ్రాములు చేపట్టాలి. టీనేజర్ల స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేసేలా గైడ్‌లైన్స్ రూపొందించాలి. టీనేజర్ల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించడం, సమతుల్య జీవనశైలిని ప్రోత్సహించడం చేయాలి.






