టీనేజ్‌లో చింపాజీల ప్రవర్తన మనుషుల్లాగే ఉంటుంది.. అధ్యయనంలో వెల్లడి

by Disha Web Desk 10 |
టీనేజ్‌లో చింపాజీల ప్రవర్తన మనుషుల్లాగే ఉంటుంది.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : మనుషుల్లో టీనేజర్స్ ఆలోచనా విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతీ విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తుంటారు. హార్మోన్ల ప్రభావమే ఇందుకు కారణం కాగా.. తద్వారా శారీరకంగా, ఆలోచనా పరంగా చాలా మార్పులు కలుగుతుంటాయి. అచ్చం ఇలాంటి మార్పులే చింపాంజీల్లోనూ గుర్తించినట్లు తాజా అధ్యయనం తెలిపింది.

చింపాంజీల మొత్తం జీవితకాలం 50 సంవత్సరాలు కాగా వీటిలో టీనేజీ దశ ఎనిమిది నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. మానవుల్లో టీనేజర్స్ వివిధ హార్మోన్ల ప్రభావానికి లోనైనట్లే.. చింపాజీల్లోనూ హార్మోనల్ బిహేవియర్స్ సంభవిస్తాయి. కొత్త రిలేషన్ షిప్స్ కోసం ఆరాటపడతాయి. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అభయారణ్యంలో పెరిగిన 40 చింపాంజీలను పరిశీలించారు. వాటిలో టీనేజీకి సంబంధించిన బిహేవియర్‌ను అబ్జర్వ్ చేశారు. తమకు అంతా తెలుసనే భావనలో ఉన్నాయని, ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకోలేదని తెలిపారు. టీనేజీలో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులైనట్టు ఆడ, మగ చింపాంజీలు కూడా అట్రాక్ట్ అవుతాయి. రిలేషన్ షిప్ కొనసాగించడానికి ఉత్సాహం చూపుతాయి. పరస్పరం కొట్లాడుకోవడం, ప్రేమించుకోవడంతో పాటు మానవుల్లాగే హఠాత్తుగా రిస్క్ తీసుకోగలిగే ప్రవృత్తిని కలిగి ఉంటాయని గుర్తించారు.


Next Story

Most Viewed