Viral Video: ఈ చిన్నారి ఒలింపిక్స్‌కు వెళ్తే గోల్డ్ పక్కా.. కానీ అదృష్టమే లేదు పాపం

by Vennela |
Viral Video: ఈ చిన్నారి ఒలింపిక్స్‌కు వెళ్తే గోల్డ్ పక్కా.. కానీ అదృష్టమే లేదు పాపం
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: కొంత మంది పిల్లలను చూస్తే చిచ్చరపిడుగులు అనక తప్పదు. ఎందుకంటే వారి టాలెంట్ అలాంటిది. చిన్న వయస్సులో పిల్లలు చేసే అల్లరి పేరెంట్స్ కు ముద్దుగా అనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తూ ఎదిగే కొద్దీ విద్యలోనూ ఆటపాటల్లోనూ సాధించే విజయాలు తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఓ చిన్నారి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓ చిన్నారికి సంబంధించిన స్టంట్ వైరల్ గా మారింది. సాధారణంగా చిన్నపిల్లలు అచ్చం పెద్ద వాళ్లే వ్యవహరిస్తుంటారు. రికార్డు క్రియేట్ విజయం సాధించడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తారు. కానీ ఈ చిన్నారి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా తన ఇంటి ముందు ఉన్న గేటుపై విన్యాసం చేస్తుంటే చూసినవాళ్లంతా ఔరా అనక తప్పదు. ఓ యూజర్ ట్విట్టర్ పోస్టు చేసిన ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

ఎందుకంటే ఈ అమ్మాయి ఒలింపిక్స్ వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టడం ఖాయం అనేలా ఉంది. కొంతమంది ప్రతిభతో పుడతారు....కానీ బహుశా అదృష్టం వారిని కనుగొంటుంది. బహుశా కాకపోవచ్చు. ఈ అమ్మాయికి అదృష్టం దక్కాలని నేను ఆశిస్తున్నాను అంటూ యూజర్ రాసుకొచ్చారు. నిజమే చాలా మంది టాలెంట్ ఉన్నా..ప్రోత్సాహం లేకపోవడంతో తమ ప్రతిభను నిరూపించలేకపోతున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.





Next Story

Most Viewed