ఇక ChatGPT ఆ విషయాలకు సమాధానం చెప్పదు..! కారణమిదే..

by Javid Pasha |

చాట్‌జీపీటీ సేఫ్టీని పెంచడం, మిస్‌ ఇన్ఫర్మేషన్‌ను తగ్గించడం, లీగల్ రిస్క్‌లను మినిమైజ్ చేయడం కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

ఇక ChatGPT ఆ విషయాలకు సమాధానం చెప్పదు..! కారణమిదే..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది ఏదో ఒక విషయంలో OpenAI సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. సమాచారం తెలుసుకోవడానికి చాట్ బాట్‌లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వాటిలో చాట్ జీపీటీ కూడా ఒకటి. ఏ సందేహాలు అడిగినా ఇది ఠక్కుమని సమాధానం చెప్తుంది. కానీ ఇక నుంచి అది మెడికల్ అండ్ లీగల్ రిలేటెడ్ అంశాలకు సమాధానం ఇవ్వదు. ఎందకంటే ఓపెన్ ఏఐ తన యూజెస్ పాలసీలను అక్టోబర్ 29 నుంచి అప్‌డేట్ చేసింది. కొత్త రూల్స్ అమలు చేస్తోంది. దీని ప్రకారం హెల్త్ అండ్ లీగల్ అడ్వైజెస్ ఇవ్వకుండా ఆపేసింది.

*ఓపెన్ ఏఐ కొత్త గైడెన్స్‌ ప్రకారం.. చాట్ జీపీటీలో లైసెన్స్ అవసరమైన టైలర్డ్(Tailored) ప్రొఫెషనల్ అడ్వైస్, లీగల్ లేదా మెడికల్ గైడెన్స్ ఇవ్వడాన్ని అది నిషేధించింది. అంతేకాకుండా కన్సెంట్ లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ చేయడం లేదా ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి హై-స్టేక్స్ ఏరియాల్లో మానవ రివ్యూ (Human review) లేకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా పరిమితం (Restrict) చేయబడింది.

*ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ద్వారా తీసుకొచ్చిన ఈ మార్పు అసలు ఉద్దేశం సేఫ్టీని పెంచడం, మిస్‌ ఇన్ఫర్మేషన్‌ను తగ్గించడం, లీగల్ రిస్క్‌లను మినిమైజ్ చేయడమేనంటున్నారు నిపుణులు. సాంకేతిక అనలిస్టుల ప్రకారం ఈ అప్‌డేట్ చాట్‌జీపీటీని సేఫర్‌గా చేస్తుంది కానీ, యూజర్లు ఇష్టపడే ప్రాక్టికల్ “ఎడ్జ్”ను లిమిట్ చేయవచ్చు. అదనంగా డిస్ట్రెస్‌లో ఉన్న యూజర్ల కోసం స్ట్రాంగర్ సేఫ్‌గార్డ్స్ జోడించబడ్డాయి. ఈ పాలసీ మార్పు AI టెక్నాలజీ దాని రెస్పాన్సిబుల్ ప్రయోజనాలను హైలైట్ చేస్తూ, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తుందన్న సందేశాన్నిచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. Link

Next Story