- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొన్ని సినిమాలకు రివ్యూ అవసరం లేదు.. ‘చావా’ కూడా అలాంటిదే.. పిల్లల ప్రైస్‌లెస్ రియాక్షన్స్(VIDEO)
విక్కీ కౌశల్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన ‘చావా’ బాక్సాఫీసు వద్ద గర్జిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ వీరగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఈ తరానికి ఆ మహాయోధుడిని పరిచయం చేసింది.

దిశ, ఫీచర్స్ : విక్కీ కౌశల్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన ‘చావా’ బాక్సాఫీసు వద్ద గర్జిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ వీరగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఈ తరానికి ఆ మహాయోధుడిని పరిచయం చేసింది. శివాజీ సావంత్ మరాఠీ నవల ఆధారంగా చావా (సింహం పిల్ల) తెరకెక్కగా.. శంభాజీ ధైర్యాన్ని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. శివాజీ కొడుకుకు అనే గుర్తింపుకు మించిన యోధుడని చెప్పింది. మరాఠా సింహాసనాన్ని అధిష్టించిన తొమ్మిదేళ్లు రాజ్య ప్రజలచే గౌరవించబడిన ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా మొఘలుల విస్తరణ ప్రణాళికలను తుంగలో తొక్కాడు. వారికి ముల్లులా మారాడు. కానీ పక్కన ఉన్న నమ్మకస్తుల ద్రోహం వల్ల ఔరంగజేబుతో బంధించబడ్డాడు. కానీ క్రూరమైన ఉరిశిక్ష కూడా అతనిలోని యోధుడిని చంపలేకపోయింది. స్వరాజ్ కోసం పోరాడకుండా నిలుపలేకపోయింది.
నిజానికి సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా.. సెకండాఫ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ వేగాన్ని పుంజుకుంటుంది. ఒంటరి వ్యక్తిగా ఉన్న శంభాజీ మొఘలులతో పోరాడుతున్న క్లైమాక్స్ గూస్‌బంప్స్‌కు మించిన ఎమోషన్స్ అందిస్తుంది. ముఖ్యంగా మహారాజ్ పాత్రలో కనిపించిన విక్కీ కౌశల్ ఇందుకోసం తన రక్తం, చెమట, కన్నీళ్లను పూర్తిగా ఇచ్చేశాడు. అంతర్గత కోపాన్ని, రుద్ర అవతారాన్ని చూపించాడు.ప్రతి సన్నివేశంలో పులిలా గర్జించాడు. కానీ అన్ని సినిమాలకు రివ్యూ అవసరం లేదు. కల్మషం లేని పిల్లల భావోద్వేగం చాలు. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను ఎలాగైనా సరే థియేటర్‌లో చూడాల్సిందే అని నిర్ణయించుకునేంతలా ప్రభావితం చేస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.






