Technology : తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్.. ‘కార్ వెండింగ్ మెషిన్‌’లతో ఉపయోగాలివే..

by Javid Pasha |   (  Updated:2025-11-04 07:23:02  IST  )

Technology : తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్.. ‘కార్ వెండింగ్ మెషిన్‌’లతో ఉపయోగాలివే..
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ పట్టణాలు, నగరాలు విస్తరిస్తున్నాయి. పెరిగిన జనాభా, నిర్మాణ రంగంలో మార్పులవల్ల ఇక్కడ విశాలమైన స్థలాల కొరత కూడా ఏర్పడుతోంది. ఉన్న స్థలంలోనే పెద్ద పెద్ద వ్యాపారాల నిర్వహణ, అధిక స్టోరేజీ సామర్థ్యాలపై సాంకేతిక నిపుణులు, నిర్వాహకులు ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్‌లోని ఓ వ్యాపార సంస్థ కార్ షాపింగ్‌ను సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా మార్చేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన 15 అంతస్తుల కార్ వెండింగ్ మెషిన్‌’ టవర్‌ను రూపొందించింది. ఇందులో సుమారు 60 లగ్జరీ వాహనాలను స్టోర్ చేయవచ్చు. అయితే దానివల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.

స్టోరేజ్ సామర్థ్యం..

కార్ వెండింగ్ మెషిన్‌ టవర్ అనేది తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లను, లేదా ఇతర వాహనాలు, వస్తువులను స్టోర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పెద్ద పెద్ద వాహన షో రూముల్లో, మాల్స్‌లో వాటిని ఉపయోగించడం ద్వారా తమ బ్రాండ్లను స్టోర్ చేయడం, ప్రదర్శించడం చేయవచ్చు. అయితే సింగపూర్‌లో పుట్టుకొచ్చిన ఈ ఆలోచనను, ఆవిష్కరణను విశ్వ వ్యాప్తం చేస్తే పట్టణాలు, నగరాల్లో వ్యాపార నిర్వహణలో స్థలాల కొరతకు ప్రత్యామ్నాయం ఏర్పడినట్టేనని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఫ్యూచరిస్టిక్ ఇంజినీరింగ్ వండర్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

ప్రయోజనాలు ఇవే..

కార్ వెండింగ్ మెషిన్‌ టవర్ అనేది ఎత్తైన భవంతుల్లో ఏ అంతస్తులోనైనా కార్లను, వాహనాలను, ఇతర వస్తువులను స్టోర్ చేయవచ్చు. కాబట్టి భవంతుల ముందు, గ్రౌండ్ ఫ్లోర్లలో పార్కింగ్ ప్లేస్‌లు లేకపోయినా వ్యాపారాల నిర్వహణకు ఆటంకం ఉండదు. పైగా ఇది కస్టమర్లు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి కూడా కార్ వెండింగ్ మెషిన్ టవర్‌లో ఉన్న వాహనాలను, వస్తువులను, టూల్స్‌ను జస్ట్ టచ్ స్క్రీన్ లేదా హ్యాండ్ హెల్డ్ డివైజ్ ద్వారా బ్రౌజ్ చేసి, తమకు నచ్చిన మోడల్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా చేశాక ఆటోమేటెడ్ “ఫిష్‌బోన్” డెలివరీ సిస్టమ్ (ఆటోమోటివ్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ - AIMS) ద్వారా కోరుకున్న కారు, ఇతర వాహనం, లేదా ఏదైనా అతి బరువైన వస్తువును 1-2 నిమిషాల్లో డెలివర్ చేస్తుంది. ఎందుకంటే ఈ సిస్టమ్‌లో ఫ్లోర్ గ్రేట్స్‌తో విండ్ రెసిస్టెన్స్ తగ్గించే ఎలివేటర్ మెకానిజం ఉంటుంది. మెట్రో సిటీస్‌లలో ల్యాండ్ స్కార్సిటీ సమస్యను సాల్వ్ చేయడానికి ఉపయోగపడే ఈ కార్ వెండింగ్ మెషిన్‌ టవర్ కేవలం స్టోరేజ్‌గా మాత్రమే కాకుండా కస్టమర్లను ఆకర్షించే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అందిస్తుంది. Link

Next Story