నిద్ర సరిపోయినా మంచం దిగాలనిపించని విచిత్ర వ్యాధి..! నిరాశ, బద్ధకంతోపాటు..!!

by Javid Pasha |   (  Updated:2025-10-16 12:52:08  IST  )

నిద్ర సరిపోయినా మంచం దిగాలనిపించని విచిత్ర వ్యాధి..! నిరాశ, బద్ధకంతోపాటు..!!
X

దిశ, ఫీచర్స్ : కంటి నిండా నిద్రపోయినప్పటికీ మంచం మీద నుంచి లేవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఏదో నిరాశ, బద్ధకం ఆవహించిన భావన వెంటాడుతుంది. కొన్నిసార్లు అది నిద్ర, మరికొన్నిసార్లు నిద్రలేమి సమస్య వేధించవచ్చు. ఈ లక్షణాలన్నీ తరచుగా కనిపిస్తుంటే గనుక అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్యకు ముందు దశ కూడా కావచ్చు. దీనినే డైసానియా (Dysania) అంటున్నారు వైద్య నిపుణులు. ఇది అధికారిక వైద్య నిర్ధారణ కానప్పటికీ పూర్తిగా నిద్రపోయిన తర్వాత కూడా మంచం నుండి లేవలేకపోవడం దీని ప్రధాన లక్షణంగా ఉంటుంది.

డైసానియాలో ఉన్నప్పుడు అలసటగా అనిపిస్తుంది. కానీ ఇది అంతకంటే ప్రభావవంతమైన ఒక విపరీతమైన (Overwhelming) ఫీలింగ్. శరీరం బరువుగా అనిపించి, పడుకున్న లేదా కూర్చున్న చోటు నుంచి లేవాలనిపించదు. ముఖ్యంగా మనసు సహకరించదు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు మానసిక కుంగుబాటు(Mental depression), యాంగ్జైటీ వంటివి వేధిస్తాయి. దీంతో సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి శరీరంలో సహజసిద్ధమైన మోటివేషన్ తగ్గుతుంది. ఫలితంగా మంచం వదలడం అసాధ్యంగా అనిపిస్తుంది. అలాగే క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్, థైరాయిడ్ డిస్‌ ఆర్డర్స్, ఫైబ్రోమయాల్జియా లేదా స్లీప్ అప్నియా వంటి మెడికల్ ఇష్యూస్ కూడా డైసానియాకు కారణం అవుతుంటాయి. లక్షణాలు గుర్తిస్తే వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా చక్కటి చక్కటి పరిష్కారం లభిస్తుంది.

Next Story