- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : పట్టుకుంటే వెలిగే ఫ్లాష్‌లైట్ ? సెల్స్, చార్జింగ్ అవసరమే లేదు!
బ్యాటరీ, చార్జింగ్ వంటివి అవసరం లేకుండానే, చేతితో టచ్ చేస్తే వెలిగే ఫ్లాష్ లైట్‌ను ఓ యువతి ఆవిష్కరించింది.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా టార్చ్‌లైట్లు, ఫ్లాష్ లైట్లు కరెంటు ద్వారా లేదా ఆయా పరికరాల్లో స్టోర్ చేయబడిన విద్యుత్ ద్వారా పనిచేస్తుంటాయి. కానీ చేతితో టచ్ చేయగానే వెలిగే డివైజ్ గురించి మీరెప్పుడైనా విన్నారా? యాన్ మకోసిన్స్‌స్కి(Ann Makosinski) అనే ఓ కెనడియన్ స్టూడెంట్ ఈ సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది. సానిచ్, బ్రిటీష్ కొలంబియాలో పెట్టిపెరిగిన ఈ యువతి తన పదిహేనేళ్ల వయసులో తయారు చేసిన ఈ పరికరానికి హాలో(Hollow Flashligh) ఈ ఫ్లాష్‌లైట్ అని పేరు పెట్టింది.
గూగుల్ సైన్స్‌ఫేర్‌లో ప్రదర్శన..
యాన్ మకోసిన్స్‌స్కి డెవలప్ చేసిన హాలో పరికరం శరీర ఉష్ణోగ్రతను (చేతి వేడిని) ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసి కాంతిని ఇవ్వగలిగే బ్యాటరీలేని ఫ్లాష్‌లైట్. నిజానికి దీనిని తయారు చేస్తానని ఆమె ముందుగా అనుకోలేదట. కానీ.. ఫిలిప్పైన్స్‌లోని తన స్నేహితురాలు తన ఇంటిలో విద్యుత్ లేకపోవడంతో రాత్రిపూట చదువుకోలేకపోతుండటం ఆమెను కలసి వేసింది. దీంతో ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం వెతకాలనుకునేది. అయితే 2013లో గూగుల్ సైన్స్‌ఫేర్ సందర్భంగా తన ప్రతిభను చాటేందుకు ప్రయత్నించి సఫలమైంది. 15-16 వయసుగల ఆవిష్కర్తల గ్రూపులో ఉన్న యాన్ మకోసిన్స్‌స్కి హాలో ఫ్లాష్‌లైట్‌ను ప్రదర్శించి ఆవిష్కర్తగా మొదటిస్థానంలో నిలిచింది. ఇందుకు గాను ఆమె 25 వేలడార్ల స్కాలర్‌షిప్ గెల్చుకున్నది. అంతేకాకుండా కెనడా-వైడ్ సైన్స్‌ఫేర్ గోల్డ్ మెడల్, ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్‌లో పలు అవార్డులు కూడా అందుకున్నది.
చేతివెళ్ల వేడితో వెలుతురు
ఇక హాలో ఫ్లాష్‌లైట్ పనిచేసే విధానం చాలా సింపుల్‌గా భౌతిక శాస్త్ర ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. పైగా ఈ అల్యూమినియం ట్యూబ్‌పై 4 పెల్టియర టైల్స్ (Thermoelectric generators) అమర్చి, బయట పీవీసీ (PVC) కవర్ ఇస్తారు. కాబట్టి చేతి వేడి (సుమారు 37°C) తగిలితే చాలు లోపలి గాలి కన్వెక్షన్ ద్వారా చల్లబడుతుంది. కేవలం 5 డిగ్రీల ఉష్ణోగ్రత తేడాతోనే 5.4 మిల్లీవాట్ల విద్యుత్ ఉత్పత్తి జనరరేట్ అవుతుంది. ఇది సమర్థవంతమైన ఎల్ఈడీ(LED) బల్బ్‌ను ప్రకాశవంతంగా వెలగిస్తుంది. చల్లని వాతావరణంలో మరింత తీవ్రంగా పనిచేస్తుంది.
నో బ్యాటరీ.. నో చార్జింగ్
ఈ హాలో ఫ్లాష్‌లైట్ పరికరంలో బ్యాటరీలు ఉండవు, చార్జింగ్ కూడా ఉండదు. కానీ చేతిలో పట్టుకున్నంత సేపు వెలుగుతూ వెలుతురును వెదజల్లుతుంది. ‘ఈ డిజైన్ ఎర్గోనామిక్, థర్మోడైనమిక్‌గా సమర్థవంతంగా పనిచేస్తుందని యాన్ మకోసిన్స్‌స్కి పేర్కొన్నది. ఈ ఆవిష్కరణ విద్యుత్ సౌకర్యంలేని ప్రదేశాల్లో, ఇండ్లల్లో తక్కువ ఖర్చుతో సస్టైనబుల్ పరిష్కారం అందిస్తుందని అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఇన్వెంటర్, పబ్లిక్ స్పీకర్‌గా పనిచేస్తున్న యాన్ మకోసిన్స్‌స్కి పలు ఇతర ఆవిష్కరణలను సైతం చేసింది. ఇవి భవిష్యత్తుల్లో రోజువారీ పరికరాలను మరింత పర్యావరణ అనకూలంగా మారుస్తాయని చెబుతున్నది. అయితే ఈ ఆవిష్కరణ ఇప్పటికీ ప్రోటోటైప్ స్టేజ్‌లోనే ఉంది. మార్కెట్లో వినియోగానికి అందుబాటులో లేదు.






