- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : ఫ్లయింగ్ డ్రోన్ అంబ్రెల్లా 2.0.. ఎగిరే గొడుగు వచ్చేసిందోచ్!
ఫ్లయింగ్ డ్రోన్ అంబ్రెల్లా 2.0 వెర్షన్‌లో సెన్సింగ్ కెమెరాలు, ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : ఎండా వానల నుంచి రక్షణ కోసం మనం ఉపయోగించే సాధారణ గొడుగుల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఫ్లయింగ్ డ్రోన్ అంబ్రెల్లా గురించి మీరెప్పుడైనా విన్నారా? కెనడాకు చెందిన ఇంజినీర్ & యూట్యూబర్ అయిన జాన్ ట్సే (John Tse)అనే వ్యక్తి దీనిని తయారు చేశాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. దీనికి ఫ్లయింగ్ డ్రోన్ 2.0 అనే పేరు పెట్టాడు. ఈ గాలిలో ఎగిరే గొడుగు వల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కదలికలను అనుసరిస్తుంది
ఫ్లయింగ్ అంబ్రెల్లా 2.0 అనే పరికరం యూజర్ ఉపయోగించే సందర్భంలో అందులోని డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి తలపై భాగాన అచ్చం గొడుగు పట్టినట్టు ఎగురుతూ.. దానిని వినియోగిస్తున్న వ్యక్తి కదలికలను ఆటోమేటిగ్గా అనుసరిస్తుంది. వర్షం లేదా ఎండ నుండి రక్షణ కల్పిస్తుంది. సాధారణ గొడుగుల మాదిరి దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం ఉండదని దాని ఆవిష్కర్త జాన్ ట్సే ‘ఐ బిల్డ్ స్టఫ్’ అనే తన యూట్యూబ్ చానెల్‌లో ఈ ప్రాజెక్ట్‌ను డాక్యుమెంట్ చేశాడు. ఇది 2024లో మాన్యువల్ వెర్షన్‌తో మొదలై, 2026లో పూర్తి అటానమస్ వెర్షన్‌గా అభివృద్ధి చెందింది.
ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్, సెన్సింగ్ కెమెరాలు
ఫ్లయింగ్ డ్రోన్ అంబ్రెల్లా 2.0 వెర్షన్‌లో డెప్త్ సెన్సింగ్ కెమెరాలు, రాస్ప్‌బెర్రీపై (Raspberry Pi) కంప్యూటర్ అండ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ వంటి అధునాతన టెక్నాలజీలు ఉపయోగించబడ్డాయి. కాబట్టి ఇది యూజర్‌ను రియల్-టైమ్‌లో ట్రాక్ చేసి, అతని వేగానికి, కదలికలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. ప్రారంభంలో హ్యాండ్‌హెల్డ్ కంట్రోలర్‌తో పనిచేసేలా తయారు జాన్ ట్సే.. వినియోగదారుల సూచనల ఆధారంగా దానిని అప్‌డేట్ చేస్తూ అటానమస్‌గా మార్చాడు.
ఉపయోగాలు ఏమిటి?
*ఫ్లయింగ్ డ్రోన్ అంబ్రెల్లా (Flying Drone Umbrella)ను ఎండ, వానల నుంచి రక్షణ కోసం ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ సౌకర్యం ఏమిటంటే.. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తి కదలికలను అనుసరిస్తూ గొడుగుగా మారి వెంట వస్తూ ఉంటుంది. పూర్తి హ్యాండ్స్-ఫ్రీ (hands-free)గా పనిచేస్తుంది.
*ఫ్లయింగ్ అంబ్రెల్లా వినియోగిస్తున్నప్పుడు చేతులతో దానిని పట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. బ్యాగులు, గ్రాసరీస్, ఇతర వస్తువలను పట్టుకోవచ్చు. ఫోన్ ఉపయోగించవచ్చు లేదా సహజంగా నడవవచ్చు. మరో విషయం ఏంటంటే ఇది ఆటోమేటిగ్గా అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఎంత దూరం నడిచినా, ఎక్కడికి తిరిగినా, వేగంగా వెళ్లినా మనిషి కదలికలను అనుసరిస్తూ వస్తుంది. తలపై గొడుగును సరిగ్గా ఉండేలా సర్దుబాటు చేసుకుంటుంది.






