IVF ఫెయిల్ అయ్యాక కూడా సహజ గర్భం సాధ్యమేనా?

by Sujitha Rachapalli |

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది పిల్లలు లేని జంటలకు సాయపడుతున్న సంతానోత్పత్తి చికిత్స. అయితే IVF సక్సెస్ రేట్ 99శాతం ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం భరించలేని బాధను అనుభవిస్తారు.

IVF ఫెయిల్ అయ్యాక కూడా సహజ గర్భం సాధ్యమేనా?
X

దిశ, ఫీచర్స్ : ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది పిల్లలు లేని జంటలకు సాయపడుతున్న సంతానోత్పత్తి చికిత్స. అయితే IVF సక్సెస్ రేట్ 99శాతం ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం భరించలేని బాధను అనుభవిస్తారు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉంది. IVF ఫెయిల్ అయ్యాక సహజ గర్భధారణ సాధ్యమేనా? అంటే.. ఆశ్చర్యకరంగా సమాధానం అవును అనే చెప్తున్నారు నిపుణులు. అంత ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ.. అనేక అంశాలు ఇందుకు దోహదం చేస్తాయి. IVF తర్వాత నిరుత్సాహపడే జంటలకు ఆశను అందిస్తాయి.

IVF వైఫల్యానికి కారణమేమిటి?

సహజ గర్భధారణను పరిగణించే ముందు IVF ఎందుకు విఫలమవుతుందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. IVFలో అండాశయ ఉద్దీపన, గుడ్డు తిరిగి పొందడం, ఫలదీకరణం, ఎంబ్రియో కల్చర్, పిండం బదిలీ వంటి దశలు ఉంటాయి. ఈ ప్రతి ఫేజ్‌లో సంతానోత్పత్తి నిపుణులు బెస్ట్‌గా ప్రయత్నించినప్పటికీ.. కొన్నిసార్లు గర్భధారణ కాకపోవచ్చు.

* వయసు పెరుగుతున్న కొద్దీ అండం నాణ్యత తగ్గుతుంది. ఇది ప్రెగ్నెన్సీ అవకాశాలను తగ్గిస్తుంది.

* ఎంబ్రియో ఇంప్లాంటేషన్ సమస్యలు ఆరోగ్యకరమైన పిండాలను కూడా గర్భాశయానికి సరిగ్గా అటాచ్ చేయకుండా నిరోధించవచ్చు.

* వీర్యకణాల నాణ్యత, సంఖ్య IVF విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

* గర్భాశయ అసాధారణతలు లేదా లైనింగ్ సమస్యలు ఎంబ్రియో ఇంప్లాంటేషన్‌కు ఆటంకం కలిగిస్తాయి.

IVF ఫెయిల్.. సహజ గర్భధారణ సాధ్యమేనా?

సంతానోత్పత్తి అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ కాగా IVF ఈ సవాళ్లను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఒక్కోసారి ఇలాంటి సమస్యలతో సక్సెస్ కాకపోవచ్చు. అయితే కొన్నిసార్లు IVF ప్రయత్నాలు ఫెయిల్ ఉన్నప్పటికీ సహజ గర్భధారణకు అవకాశం ఉంది.

* IVFలో అండాశయ ఉద్దీపన(ovarian stimulation) మందులు వంటి హార్మోన్ల చికిత్సలు ఉంటాయి. ఇవి అండోత్సర్గమును పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో అండాశయాలు IVF తర్వాత మెరుగైన-నాణ్యత గల గుడ్లను విడుదల చేయవచ్చు. ఇది సహజ గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుంది.

* IVF గణనీయమైన భావోద్వేగ నష్టాన్ని కలిగిస్తుంది. ఇది సహజ గర్భధారణను నిరోధించే ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే IVF సైకిల్ విఫలమైతే.. కొంతమంది జంటలు సైకలాజికల్‌గా రిలాక్స్ అవుతారు. ఈ పరిస్థితి ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. స్ట్రెస్ అనేది వంధ్యత్వంతో ముడిపడి ఉన్నందునా.. ఈ మెంటల్ రిలాక్సేషన్ నేచురల్ ప్రెగ్నెన్సీని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

* ఒక స్త్రీ ఒకటి లేదా అంతకు మించిన IVF సైకిల్స్‌ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటే.. మరింత ఆరోగ్యకరమైన అండోత్సర్గము, అండాల నాణ్యతను కలిగి ఉండొచ్చు. అలాంటి వారు సహజంగా గర్భం దాల్చే మంచి అవకాశం ఉండవచ్చు.

* చాలా మంది జంటలు IVF చేయించుకున్న తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి నిర్వహణ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ సంతానోత్పత్తిని పెంచుతాయి. విఫలమైన IVF చక్రం తర్వాత కూడా సహజ గర్భధారణ అవకాశాన్ని అందిస్తాయి.

మళ్ళీ వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

IVF ఫెయిల్ అయ్యాక సహజ గర్భధారణ సాధ్యమే అయినప్పటికీ.. కొన్ని జంటలు ఇప్పటికీ గర్భం దాల్చడానికి ఇబ్బంది పడవచ్చు. రీజనేబుల్ టైమ్ ఫ్రేమ్‌లో గర్భం దాల్చకపోతే లేదా IVF మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయితే మళ్ళీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం మంచిది. తదుపరి చికిత్స ఎంపికలతో పిల్లలను కనాలనే మీ కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి.

Next Story