ఊసరవెల్లి నిజంగానే రంగులు మార్చుతుందా.. అసలు నిజం ఏమిటంటే?

by Disha Web Desk 8 |
ఊసరవెల్లి నిజంగానే రంగులు మార్చుతుందా.. అసలు నిజం ఏమిటంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఊసరవెల్లి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది రంగులు. మనం చిన్నప్పటి నుంచి వింటుటాం ఊసరవెల్లి రంగులు మార్చుతుంది, అది చెట్టు మీద ఉండే ఆకుపచ్చని రంగులో, భూమి మీద ఉంటే గోధుమ రంగులో ఇలా ఏ రంగు మీద ఉంటే ఆ రంగులోకి మారుతుందని.అంతేకాకుండా చాలా మంది అంటుంటారు, ఈ వ్యక్తి అచ్చం ఊసర వెల్లిలానే రంగులు మార్చుతున్నాడని.మరి ఊసరవెల్లి నిజంగానే రంగులు మార్చుతుందా?అయితే ఊసర వెల్లి రంగులు మార్చడంలో అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఊసరవెల్లి రంగులు మార్చదంట. ఊసరవెల్లి చర్మం పారదర్శకంగా ఉంటుంది. చర్మం కింది భాగంలో రంగు కణాలుంటాయి. ఊసరవెల్లి పారదర్శక చర్మం క్రింద పసుపు, నలుపు, ఎరుపు గ్రాన్యులర్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఈ కారణంగానే ఊసరవెల్లి ఎక్కడ ఉంటే.. ఆ రంగు కనిపిస్తుందంట.ఫోటోనిక్ స్ఫటికాల పొర కాంతిని ప్రతిబింబిస్తుందంట,దానివల్లే ఊ సరవెల్లి వేర్వేరు రంగుల్లో మనకు కనిపిస్తోందంట.అంతేకాకుండా కాంతి ఉష్ణోగ్రతల కారణంగా కూడా ఊసరవెల్లి తన రంగులు మార్చుతుందంట.

Next Story

Most Viewed