అచ్చం మనుషుల్లాగే బట్టలు మడత పెట్టే రోబో.. కాలిఫోర్నియా నిపుణుల కొత్త ఆవిష్కరణ

by Javid Pasha |

తాజాగా కాలిఫోర్నియాలోని ఒక రోబోటిక్స్ స్టార్టప్‌కు చెందిన సాంకేతిక నిపుణులు మరో నూతన ఆవిష్కరణకు తెరతీశారు. అచ్చం మనుషుల్లా బట్టలు మడతపెట్టే రోబోట్‌ను డెవలప్ చేశారు.

అచ్చం మనుషుల్లాగే బట్టలు మడత పెట్టే రోబో.. కాలిఫోర్నియా నిపుణుల కొత్త ఆవిష్కరణ
X

దిశ, ఫీచర్స్ : ఇంటి పనులు మొదలుకొని ఇండస్ట్రీయల్ సెక్టార్ వరకు పలు రకాల హ్యూమనాయిడ్ రోబోట్స్ అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏఐ ఆధారిత రోబోట్స్ అయితే వివిధ పనుల్లో మానవులకు కంఫర్ట్‌ను అందిస్తున్నాయి. సమయాన్ని ఆదా చేస్తూ సృజనాత్మకతను పెంచుకోవడంలో సహాయపడుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని ఒక రోబోటిక్స్ స్టార్టప్‌కు చెందిన సాంకేతిక నిపుణులు మరో నూతన ఆవిష్కరణకు తెరతీశారు. అచ్చం మనుషుల్లా బట్టలు మడతపెట్టే రోబోట్‌ను డెవలప్ చేశారు.

ఇండ్లల్లో బట్టలు సర్దడం, మడతపెట్టి ఒక దగ్గర ఉంచడం సాధారణ శ్రమగానే అనిపించవచ్చు. కానీ ఆస్పత్రుల్లో, హాస్టల్స్‌లల్లో, వివిధ కమ్యూనిటీల్లో, పెద్ద పెద్ద కుటుంబాలు కలిగిన ఇండ్లల్లో ఆ పనిచేయడం వ్యక్తులకు అధిక అలసట, అధిక శ్రమతోపాటు కొన్నిసార్లు రిస్క్‌తో కూడిన పనిగా ఉంటుంది. ఇక బట్టల తయారీ పరిశ్రమల్లో, క్లాతింగ్ స్టోరేజ్‌ హౌస్‌లలో అయితే బట్టలను క్రమ పద్ధతితో సర్దడం, స్టోర్ చేయడం ఎంత శ్రమతో కూడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి పనులను సులభతరం చేయడంతో పాటు గృహాల్లో తరచుగా పునరావృతమయ్యే బట్టలు మడతపెట్టే పనిని ఆటోమేటిగ్గా నిర్వహించగల ఇసాక్ (Isaac) అనే పేరుగల రోబోట్‌ను కాలిఫోర్నియా టెక్నాలజిస్టులు డెవలప్ చేశారు.

ఇసాక్ (Isaac) రోబో.. ప్రపచంలోనే మొట్టమొదటి సారిగా రూపొందించిన వ్యక్తిగత రోబోట్(personal robot)గా దాని తయారీదారులు పేర్కొంటున్నారు. ఇది బట్టలు మడత పెట్టడంతో పాటు గదులు శుభ్రపర్చడం, ఆహారం అందించడం వంటి రోజువారీ పనులను సైతం స్వయం చాలకంగా నిర్వహింగలదని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆటోమేటిక్ రోబో చేతులు(ఆర్మ్‌లు) లాండ్రోమాట్‌లలో, స్టోరేజ్ హౌస్‌లలో, మాల్స్‌లో బట్టలను, వాటి రకాలను గుర్తించి, వివిధ ఫాబ్రిక్ ఆకృతులను సమర్థవంతంగా మేనేజ్ చేయడం, మానవ సహాయం లేకుండానే మడతపెట్టడం వంటివి ఎంతో నైపుణ్యంగా చేయగలదు. Link

Next Story